బీజేపీ తీర్థం పుచ్చుకున్న బాలీవుడ్ యాక్షన్ సూపర్ స్టార్ సన్ని డియోల్..

బాలీవుడ్‌లో మాస్ యాక్షన్ సినిమాలకు అతనే కేరాఫ్ అడ్రస్. అతను డైలాగు చెబితే థియేటర్స్ దద్దరిల్సాందే. బీటౌన్‌లో ఒకప్పుడు నంబర్ వన్ హీరోగా ఒక వెలుగు వెలిగిన ఆ హీరోనే సన్నిడియోల్. తండ్రి ధర్మేంద్ర అడుగుజాడల్లో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి..తండ్రికి తగ్గ తనయుడిగా బాలీవుడ్ యాక్షన్ హీరోగా పేరు గడించాడు. అంతేకాదు ఇపుడు తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లో ప్రవేశించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో బీజేపీ తరుపున అమృత్ సర్ నుంచి కానీ గురుదాస్ పూర్ నుంచి కానీ ఎంపీగా పోటీచేసే అవకాశం మెండుగా ఉన్నాయి.