Bollywood 6 Months Box Office Report : 2022లో అపుడే ఆరు నెలలు పూర్తికావొస్తున్నాయి. అంటే సగ భాగం పూర్తైయింది. ఈ ఆరు నెలల కాలంలో ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు రిలీజైయ్యాయి. అందులో డైరెక్ట్ హిందీ చిత్రాల విషయాలకొస్తే.. వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ సూపర్ హిట్ అనేకంటే పెట్టిన పెట్టుబడికి 20 రెట్లకు పైగా లాభాలను తీసుకొచ్చి అసలు సిసలు హిట్‌గా నిలిచింది. అటు ఆలియా భట్ .. ‘గుంగుబాయ్ కతియావాడి’ , భూల్ భులయ్యా 2’ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. (File/Photo)
గంగుబాయి కతియావాడి | 2022న సంజయ్ లీలా భన్సాలీ దర్శక, నిర్మాణంలో ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్ ముఖ్యపాత్రల్లో నటించిన మూవీ ‘గంగుబాయ్ కతియావాడి’ సినిమా ఫిబ్రవరి 25న విడుదలై బాలీవుడ్లో తొలి హిట్‌గా నిలిచింది. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 209.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మంచి సక్సెస్ అందుకుంది. ఇక జనవరి , ఫిబ్రవరి నెలల్లో విడుదైలన ‘36 ఫార్మ హౌస్’, ‘లూప్ లపేటా’, గెహ్రారియా’, బదాయి దో, ఏ థర్స్ డే, లవ్ హాస్టల్ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయాయి. (File/Photo)
The Kashmir Files | మార్చి నెలలో ప్రభాస్ ’రాధే శ్యామ్’మూవీ విడుదలవుతున్న ఎలాంటి సంకోచం లేకుండా ఈ సినిమాను విడుదల చేసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గట్స్‌ను మెచ్చుకోవాలి. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ బాక్పాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. 1990లో కశ్మీర్ ప్రాంతం నుంచి అక్కడ పాకిస్థాన్ ప్రేరేపిత ముస్లిమ్స్ నుంచి వెళ్లగొట్టబడిన కశ్మీరీ పండితుల దీనగాథను ఎంతో హృద్యంగా తెరకెక్కించి విమర్శకులు ప్రశంసలు అందుకున్నారు. దాదాపు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 340.16 కోట్లను వసూళు చేసి ఔరా అనిపించింది. (File/Photo)
Radhe Shyam | మార్చి 11న రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సినిమా హిందీ బెల్ట్‌లో అంతగా నడవలేదు. ఈ సినిమా హిందీలో దాదాపు రూ. 40 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి డిజాస్టర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 214.04 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. (Twitter/Photo)
Bachchan Pandey | మార్చి 18న ఎన్నో అంచనాల మధ్య విడుదలైన అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’ మూవీ బాక్పాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తమిళంలో హిట్టైన ‘జిగర్తాండ’ మూవీకి రీమేక్. ఈ సినిమాను తెలుుగలో ‘గద్దలకొండ గణేష్’ సినిమాగా వచ్చింది. ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 68.61 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమాతో పాటు మార్చి నెలలో విడుదలైన అమితాబ్ ‘జుండ్’, తులసీదాస్ జూనియర్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. ఇక ఇదే నెలలో విడుదలైన విధ్యా బాలన్ ‘జల్సా, రిషీ కపూర్ చివరి చిత్రం ‘శర్మజీ నమ్కీన్’ చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. (Twitter/Photo)
RRR | ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి వారం హిందీలో రూ. 133.07 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించింది. రెండో వారం రూ. 76.25 కోట్లు నెట్ కలెక్షన్స్ మూడో వారం ఈ సినిమా రూ. 23.50 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసిన అనంతరం ఈ సినిమా హిందీలో రూ. 276.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో సౌత్ డబ్బింగ్ సినిమాల్లో మూడో స్థానంలో ఉంది. (Twitter/Photo)
Attack Part 1 | ఏప్రిల్ 1న బాలీవుడ్లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన జాన్ అబ్రహం హీరోగా లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కనీసం రూ. 20 కోట్లను కూడా రాబట్టలేక చతికిలబడింది. అటు ఏప్రిల్‌లో కౌన్ ప్రవీణ్ తాంబే, కోబాల్ట్ బ్లూ, దస్వీ, హర్దంగ్ సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. అందలో దస్వీ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో మంచి టాక్ సొంతం చేసుకుంది. (Twitter/Photo)
KGF Chapter 2 | Yash : యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది.భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్లో టాక్ తెచ్చుకుంది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసే వరకు హిందీలో రూ. 435.20 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం రేపింది. అంతేకాదు ఈ యేడాది బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఓవరాల్‌గా హిందీ చిత్ర సీమలో ఎక్కువ వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. (Twitter/Photo)
(KGF Chapter 2 Photo : Twitter)
Jersey | తెలుగులో నాని హీరోగా ‘జెర్సీ’ మూవీని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరితోనే హిందీలో జెర్సీ’ సినిమాను ఏప్రిల్ 22న విడుదలైంది. ఈ చిత్రాన్ని జెర్సీ మూవీని తెలుగులో నిర్మించిన నాగ వంశీ, దిల్ రాజు, అల్లు అరవింద్‌తో పాటు అమన్ గిల్‌తో కలిసి నిర్మించారు. రూ. 95 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 27 కోట్లను మాత్రమే వసూళు చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
Runway 34 | బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ నటిస్తూ, నిర్మిస్తూ.. దర్శకత్వం వహించిన చిత్రం ‘రన్ వే 34’. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మరో కీలక పాత్రలో నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)కథానాయికగా నటించింది. ఏప్రిల్ 29న విడుదలైన ఈ సినిమా బాక్సాపీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ. 65 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్పాపీస్ దగ్గర రూ. 47.65 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. (Twitter/Photo)
Bhool Bhulaiayaa 2 | టబు ద్విపాత్రాభినయంతో కార్తీన్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన మూవీ భూల్ భులయ్యా 2’. అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భూల్ భులయ్యా 2’ (Bhool Bhulaiyaa 2) సినిమాకు మొదటి రోజు మొదటి ఆట నుంచే బాలీవుడ్లో హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. మొత్తంగా హార్రర్ కామెడీలకు తిరుగుండదని మరోసారి ‘భూల్ భులయ్యా 2’తో ప్రూవ్ చేసింది. ఈ సినిమా మే 20న విడుదలైంది. రూ. 65 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 262.04 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
Anek | ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘అనేక్’. ఈ సినిమా. మే 27న విడుదలైన ఈ సినిమా బాక్పాఫీస్ దగ్గర రూ. 12 కోట్ల వరకు రాబట్టి అట్టర్ ఫ్లాప్ లిస్టులో చేరింది. దీంతో పాటు మే నెలలో విడుదలైన ‘మేరీ దేశ్ కీ ధర్తి’. దేహతి డిస్కో, హ్యామిలింప్, సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. ఇక అనిల్ కపూర్, ఆయన తనయుడు హర్షవర్ధన్ కపూర్ నటించిన ‘థార్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలై పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయాయి. (File/Photo)
Samrat Prithviraj | బాలీవుడ్లో అక్షయ్ కుమార్ వరుస సినిమాాలతో అదరగొడుతున్నారు. ఈ కోవలో ఈయన తొలిసారి చారిత్రక పాత్రలో నటించిన మూవీ ‘సమ్రాట్ పృథ్వీరాజ్’. సినిమాకు టాక్ బాగున్నా.. అందుకు తగ్గ వసూళ్లను రాబట్టలేకపోయింది. మే 3న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమా రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ. 85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ను నిరాశ పరిచింది. (File/Photo)
Major | అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ‘మేజర్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. హిందీలో రూ. 5 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం అక్కడ రూ. 10 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర రూ. 65 కోట్ల గ్రాస్ వసూళ్లతో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
Jugjugg Jeeyo | రాజ్ మెహతా దర్శకత్వంలో అనిల్ కపూర్, వరుణ్ ధావన్, నీతూ కపూర్,కియారా అద్వానీ నటించిన ‘జుగ్ జుగ్ జియో’ సినిమా జూన్ 24న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. దాదాపు రూ. 85 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 66.95 కోట్లను వసూళు చేసి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఓవరాల్ రన్లో ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లు కొల్లగొడుతుందో చూడాలి. (Twitter/Photo)
మొత్తంగా బాలీవుడ్లో ఈ ఆరు నెలల్లో గంగుబాయి కతియావాడితో బోణి కొట్టింది. ఆ తర్వాత ‘ది కశ్మీర్ ఫైల్స్’, భూల్ భులయ్యా 2, జుగ్ జుగ్ జియో సినిమాలు హిట్ అనిపించుకున్నాయి. అటు డబ్బింగ్ సినిమాల్లో ఆర్ఆర్ఆర్, కేజీఎప్ 2, మేజర్ సినిమాలు అక్కడ సూపర్ హిట్టైయ్యాయి. మొత్తంగా బాలీవుడ్లో ఈ ఆరు నెలల కాలంలో సాలిడ్‌గా 7 హిట్స్ దక్కాయి.