Bollywood 2022 Release Movies : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సహా బాలీవుడ్లో విడుదల కాబోతున్న టాలీవుడ్ హీరోల ప్యాన్ ఇండియా మూవీస్ ఇవే. ప్రస్తుతం తెలుగు సినిమాలకు ప్యాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మన సినిమాలు కూడా జాతీయ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడిస్తున్నాయి. ఇప్పటికే బాహుబలి,కేజీఎఫ్, సాహో సినిమాలో ప్రూవ్ అయింది. 2022లో బాలీవుడ్లో విడుదల కాబోతున్న సినిమాల్లో మన తెలుగు ప్యాన్ ఇండియా మూవీస్ ఉండటం వివేషం. (Twitter/Photo)
2022 జనవరి 6 | 2022లో బాలీవుడ్లో విడుదల కాబోతున్న మొదటి సినిమా ‘గంగుబాయి కతియావాడి’. అలియా భట్ టైటిల్ రోల్లోయాక్ట్ చేసిన మూవీ ‘గంగూబాయ్ కతియావాడి’. ఈ సినిమాను వచ్చే యేడాది జనవరి 6న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. (Alia Bhatt Ganubai movie)
జనవరి 7 | రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా ఆలియా భట్, ఒలివియా మోరీస్, హీరోయిన్స్‌గా నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎట్టకేలకు వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న బాక్సాఫీస్ బరిలో దింపుతున్నారు ఈ సినిమాను తెలుగు,హిందీతో పాటు మిగతా భారతీయ భాషల్లో ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో అన్ని ఇండస్ట్రీస్‌లో సంక్రాంతి పోటీ మరింత రసవత్తరంగా మారింది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ రాకతో సంక్రాంతి పోటీలో ఎన్ని సినిమాలు మిగులుతాయో అన్నది చూడాలి. మొత్తంగా రాజమౌళి ఒక్క నిర్ణయంతో మరోసారి సంక్రాంతి బాక్సాఫీస్ హీట్ ఎక్కింది. (Twitter/Photo)