మన దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ కొంత మంది కథానాయకులు..ఆ తర్వాత కాలంలో నాయకులుగా రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలిగారు. ఇంకోవైపు రాజకీయ రంగంలో తమదైన ముద్ర వేసిన పొలిటిషన్స్ జీవితాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. తాజాగా వెండితెరపై లాలూ జీవితంపై సినిమా తెరకెక్కనుంది.
బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ జీవితంపై సినిమాను తెరకెక్కిస్తున్నారు (File Photo)
2/ 14
బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పాత్రలో భోజ్‌పురి నటుడు యశ్ కుమార్ నటిస్తున్నాడు (File photo)
3/ 14
వివేక్ ఓబెరాయ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్రలో ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్ (File photo)
4/ 14
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా దారి తీసిన పరిస్థితులపై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు.
5/ 14
మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే జీవితకథతో ‘ఠాక్రే’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో బాల్ ఠాక్రే పాత్రలో విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దీఖీ నటించారు.
6/ 14
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు రామారావు జీవితకథను ఆయన తనయుడు బాలకృష్ణ...నటిస్తూ ఈ బయోపిక్‌ను తెరకెక్కించాడు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదలైంది.
7/ 14
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. ఈ చిత్రంలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించాడు.
8/ 14
కంగన రనౌత్ జయలలిత పాత్రలో ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో బయోపిక్ సినిమా తెరకెక్కింది. ‘తలైవి’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం కంగనా పూర్తిగా మేకోవర్ అవుతోంది. (Twitter/Photo)
9/ 14
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రమ్యకృష్ణ..జయలలిత పాత్రలో ‘క్వీన్’ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. (Twitter/Photo)
10/ 14
తమిళనాడు ప్రజలకు అమ్మగా తన కనుసైగలతో రాజకీయాలను శాసించిన జయలలిత జీవితంపై ఒకేసారి మూడు బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే నిత్యామీనన్ జయలలితగా ‘ది ఐరన్ లేడీ’ అనే సినిమాను కొత్త దర్శకుడు ప్రియదర్శన్ డైరెక్ట్ చేస్తున్నాడు.
11/ 14
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితంపై ‘ఉద్యమ సింహం’ సినిమా తెరకెక్కింది. (facebook/photo)
12/ 14
‘ఉద్యమ సింహం’ సినిమా తర్వాత కేసీఆర్ జీవితంపై ‘తెలంగాణ దేవుడు’ పేరుతో శ్రీకాంత్ హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేసారు. వీటితో పాటు కేసీఆర్ జీవితంపై మరికొన్ని చిత్రాలు తెరకెక్కనున్నట్టు సమాచారం.
13/ 14
తెలంగాణ సీఎంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితంపై ‘చంద్రోదయం’ మూవీని అనౌన్స్ చేసారు. పి.వెంకట రమణ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ రద్దు చేసినట్టు ప్రకటించారు. (twitter/photo)
14/ 14
తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ సినిమాలో అజ్మల్ వై.యస్.జగన్ పాత్రలో నటిస్తున్నాడు. (twitter/Photo)