పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్.. పవర్ స్టార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం తనకు ఎంతో ప్లస్ అయిందని చెప్పింది. కెరీర్ ఆరంభంలోనే పవన్ కళ్యాణ్, కల్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ లాంటి పెద్ద స్టార్లతో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది.
కెరీర్ ఆరంభంలోనే ఎన్టీఆర్ ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అని సంయుక్త పేర్కొంది. ఇది తన కెరీర్‌కు, భవిష్యత్‌కు చాలా ప్లస్ పాయింట్ అవుతుందని ఆమె చెప్పింది. రోజుకు ఒక గంట సేపు ట్యూటర్ పెట్టుకొని మరీ తెలుగు నేర్చుకున్నానని చెప్పిన సంయుక్త.. కెరీర్ నిలబెట్టుకునేందుకు ఎంతైనా కష్టపడతా అని చెప్పుకొచ్చింది.