Bimbisara World Television Premier : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన మూవీ ‘బింబిసార’. ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ట్రేడ్ పండితులను ఆశ్యర్యపోయేలా చేసింది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా జీ5 ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఖరానట్టు సమాచారం. ( Bimbisara ott update twitter)
కొన్ని సినిమాలు థియేటర్స్‌లో హిట్ కాకున్నా.. ఓటీటీలో సూపర్ హిట్ అవుతుంటాయి. కానీ కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ మూవీ థియేటర్స్‌తో పాటు ఓటీటీలో సూపర్ హిట్‌గా నిలిచింది. దీపావళి కానుకగా జీ5లో ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుంది. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. (Twitter/Photo)
నందమూరి కళ్యాణ్ రామ్ విషయానికొస్తే... హిట్ ఫ్లాపులకు సంబంధం లేకుండా టాలీవుడ్ హీరోగా సత్తా చూపుతున్నారు. ఈ యేడాది ఈయన నటించిన చిత్రం ‘బింబిసార’. ఈ యేడాది ఆగష్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాతో మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా మౌత్ టాక్‌తో మంచి వసూళ్లనే సాధించింది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జనవరి 1న నూతన యేడాది కానుకగా జీ టీవీలో ప్రసారం కానున్నట్టు సమాచారం. (Twitter/Photo)
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్.. బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. యూఎస్‌లో మొదటిసారి వన్ మిలియన్ యూస్ డాలర్స్ రాబట్టింది.బింబిసార మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ. 7.27 కోట్లు షేర్ ( రూ. 11.50 కోట్ల గ్రాస్) రాబట్టింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసింది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే.. (Twitter/Photo)
.తెలంగాణ (నైజాం)లో రూ. 11.85కోట్లు షేర్ రాయలసీమ (సీడెడ్)లో రూ. 8.10 కోట్లు షేర్, ఉత్తరాంధ్ర రూ. 4.91కోట్లు.. ఈస్ట్ గోదావరి - రూ. 2.01 కోట్లు.. వెస్ట్ గోదావరి - రూ. 1.47 కోట్లు గుంటూరు - రూ. 2.26కోట్లు కృష్ణా - రూ. 1.60 కోట్లు.. నెల్లూరు రూ. 0.96 కోట్లు.. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 33.16కోట్లు షేర్ (రూ. 53.35కోట్ల గ్రాస్ వసూళ్లు) రాబట్టింది. ఇక నైజాంలో ఈ సినిమా రూ. 11 కోట్ల షేర్ మార్క్‌ను క్రాస్ చేయడం విశేషం. (Twitter/Photo)
ఇక కర్ణాటక + రెస్టాఫ్ భారత్ కలిపి రూ. 2.36కోట్లు.. ఓవర్సీస్ - రూ. 2.40 కోట్లు.. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా బింబిసార టోటల్ కలెక్షన్స్ విషయానిస్తే.. రూ. 37.92కోట్ల షేర్ (రూ. 65.20 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు కళ్యాణ్ రామ్ కెరీర్లో తొలి రూ. 60 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
నందమూరి కళ్యాణ్ రామ్ ఇతను హీరోగానే కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ. 2.09 కోట్ల లాభాల్లోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది.టోటల్ రన్లో ఈ సినిమా రూ. 21.72కోట్ల షేర్ లాభాలను తీసుకొచ్చింది. ఇక డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రూపేణా ఈ సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చినట్టు సమాచారం. (Twitter/Photo)
పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ (Bimbisara) సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనివిందు చేశాడు.ఈ సినిమా విజయంలో కీరవాణి అందించిన సంగీతం పెద్ద ఎసెట్‌గా నిలిచింది. (Twitter/Photo)