బింబిసార మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ. 7.27 కోట్లు షేర్ ( రూ. 11.50 కోట్ల గ్రాస్) రాబట్టింది. రెండో రోజు ఈ సినిమా రూ. 5.10 కోట్లు షేర్ (రూ. 8.50 కోట్ల గ్రాస్) మూడో రోజు ఈ సినిమా రూ. 5.92 కోట్లు షేర్ (రూ, 10 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. నాల్గో రోజు ఈ సినిమా రూ. 2.56 కోట్లు (రూ. 4.30 కోట్లు), ఐదు రోజు రూ. 2.77 కోట్లు (రూ. 4.70 కోట్ల గ్రాస్), ఆరో రోజు రూ. 1.22 (రూ. 2.10 కోట్లు), ఏడో రోజు 0.73 కోట్లు (రూ. 1.20 కోట్లు) రాబట్టింది. (Twitter/Photo)
.8వ రోజు రూ. 1.28 షేర్ (రూ. 2.10 కోట్లు గ్రాస్), 9వ రోజు రూ. 1.25 కోట్లు షేర్ ( రూ. 2.10 కోట్ల గ్రాస్), పదో రోజు రూ. 1.66 కోట్లు (రూ.2.65 కోట్లు) పదకొండో రోజు రూ. 1.85 కోట్లు షేర్ (రూ. 3.10 కోట్ల గ్రాస్), 12వ రోజు రూ.0.82 కోట్లు (రూ. రూ. 1.35 కోట్లు గ్రాస్, 13వరోజు రూ. 50 లక్షలు (రూ. 85 లక్షలు),14వ రోజు 0.33 కోట్లు (రూ. 0.60 కోట్ల గ్రాస్),15వ రోజు రూ. 0.56కోట్ల షేర్ (రూ. 1.05 కోట్ల గ్రాస్),16వ రోజు ఈ సినిమా .061 కోట్ల షేర్ (రూ. 1.10 కోట్ల గ్రాస్),17వ రోజు రూ. 0.92 కోట్ల షేర్ (రూ. 1.75 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. (Twitter/Photo)
ఏరియా వైజ్ 17 రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో రూ. 11.01కోట్లు షేర్ రాయలసీమ (సీడెడ్)లో రూ. 7.37 కోట్లు షేర్, ఉత్తరాంధ్ర రూ. 4.66కోట్లు.. ఈస్ట్ గోదావరి - రూ. 1.87 కోట్లు.. వెస్ట్ గోదావరి - రూ. 1.38 కోట్లు గుంటూరు - రూ. 2.13కోట్లు కృష్ణా - రూ. 1.56 కోట్లు.. నెల్లూరు రూ. 0.89 కోట్లు.. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి 17 రోజుల్లో కలిపి రూ. 30.87 కోట్లు షేర్ (రూ. 49.00కోట్ల గ్రాస్ వసూళ్లు) రాబట్టింది. ఇక నైజాంలో ఈ సినిమా రూ. 11 కోట్ల షేర్ మార్క్‌ను క్రాస్ చేయడం విశేషం. (Twitter/Photo)
ఇక కర్ణాటక + రెస్టాఫ్ భారత్ కలిపి రూ. 2.20కోట్లు.. ఓవర్సీస్ - రూ. 2.28 కోట్లు.. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా బింబిసార 17 రోజుల కలెక్షన్స్ విషయానిస్తే.. రూ. 35.35కోట్ల షేర్ (రూ. 60.00 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు కళ్యాణ్ రామ్ కెరీర్లో తొలి రూ. 60 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
నందమూరి కళ్యాణ్ రామ్ ఇతను హీరోగానే కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara) . ఈ సినిమాలో కళ్యాన్ రామ్ సరసన హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటించారు.ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ. 2.09 కోట్ల లాభాల్లోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఓవరాల్‌గా 17 రోజుల్లో ఈ సినిమా రూ. 19.15 కోట్లు లాభాల్లోకి వచ్చింది. టోటల్ రన్లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి. (Twitter/Photo)
పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ (Bimbisara) సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనివిందు చేశాడు.ఈ సినిమా విజయంలో కీరవాణి అందించిన సంగీతం పెద్ద ఎసెట్‌గా నిలిచింది. (Twitter/Photo)
కళ్యాణ్ రామ్ బింబిసార ఏరియా వైజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ) రూ. 5 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ) రూ. 2 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్ రూ. 6.50 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 13.50 కోట్లు.. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ - రూ. 1.1 కోట్లు.. ఓవర్సీస్ - రూ. 1 కోటి రూపాయలు టోటల్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 15.60 కోట్లు.. బ్రేక్ ఈవెన్ రూ. 16.20 కోట్లు రాబట్టాలి. మొత్తంగా ఇప్పటి వరకు 35.35 కోట్ల షేర్ (రూ. 60.00 కోట్ల గ్రాస్) వసూళ్లు రాబట్టింది (Twitter/Photo)
ఇక కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ‘బింబిసార’ (Bimbisara) మూవీతో పాటు .. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. (Twitter/Photo)