బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss Telugu) చూస్తుండగానే 11 వ వారంలోకి అడుగు పెట్టేసింది. హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనే విషయంలో కాస్త ఉత్కంఠే అని చెప్పాలి. ఎందుకంటే.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్నా వాళ్లు కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. వారం క్రితం విశ్వా బయటకు రావడం దీనికి బలాన్ని చేకూరినట్లు అయింది.
విశ్వా 9 వ ఎలిమినేటర్ గా హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇక 10 వ ఎలిమినేషన్లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. చివరకు ఎలిమినేషన్ లేకుండా చేసేశాడు. జెస్సీకి ఆరోగ్యం బాగాలేకపోడంతో అతడిని ఇంటి నుంచి బయటకు పంపించేశారు. దీంతో హౌస్ లో 10వ వారంలో వీక్ గా ఉన్న మానస్, కాజల్ సేవ్ అయ్యారు. జెస్సీ ఇంటి నుంచి ఒకరు బయటకు వెళ్లడంతో ఒకరికి లైఫ్ ఇచ్చి వెళ్లిపోయినట్లు అర్థం అయింది.
అయితే హౌస్ లో ఎంత చేసినా.. ఎన్ని టాస్క్ లు ఆడినా బయట ప్రేక్షకులు వేసే ఓట్లపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే నామినేషన్లోకి వచ్చిన సభ్యుల్లో ఎక్కువగా ఈ వారం ఎలిమినేట్ అయ్యే సూచనలు కాజల్, ప్రియాంక, యానీ కే ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిలో కూడా ఎక్కువగా బయటకు వెళ్లే చాన్స్ ప్రియాంకకు ఉన్నట్లు అర్థం అవుతోంది.