Bigg Boss 6: బిగ్ బాస్ ఫైనల్ కోసం బిగ్గెస్ట్ స్కెచ్! బాలయ్య బాబుతో ప్లాన్ వర్కవుటయ్యేనా..?
Bigg Boss 6: బిగ్ బాస్ ఫైనల్ కోసం బిగ్గెస్ట్ స్కెచ్! బాలయ్య బాబుతో ప్లాన్ వర్కవుటయ్యేనా..?
Balakrishna | Bigg Boss Telugu 6: తొలి ఎపిసోడ్ కు అనుకున్న స్థాయిలో రేటింగ్స్ రాకపోవడంతో.. ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిందట బిగ్ బాస్ టీమ్. ఎలాగైనా రికార్డ్ స్థాయిలో రేటింగ్ అందుకోవాలనే కోణంలో సన్నాహాలు చేసిన మేనేజ్మెంట్ బాలయ్య బాబును రంగంలోకి దించబోతోందని సమాచారం.
బుల్లితెర భారీ రియాలిటీ షోగా గుర్తింపు పొందిన బిగ్ బాస్ అన్ని భాషల్లో కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తెలుగు విషయానికొస్తే ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. పలు విమర్శల నడుమ ఈ షో రసవత్తరంగా సాగుతోంది.
2/ 8
మొత్తం 21 మంది కంటిస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ షో మొదలైన రోజే నారాయణ ఎంటరై అది బూతుల స్వర్గం అని, వింత జంతువులు ఈ హౌస్ లోకి వచ్చాయని సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఓ వర్గం ప్రేక్షకులను ఈ షో మరింత నిరాశ పర్చింది.
3/ 8
దీంతో షో ఆరంభంలో టీఆర్ఫీ పరంగా చతికిల పడిన బిగ్ బాస్.. క్రమంగా పుంజుకుంది. కంటిస్టెంట్స్ ఆటతీరు మెరుగు పడటంతో షో ట్రాక్ లోకి వచ్చేసింది. హౌస్ లోకి వెళ్లిన 21 మంది ఆటలో భాగంగా ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు.
4/ 8
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రోహిత్, రేవంత్, కీర్తి, శ్రీహన్, ఆది రెడ్డి ఉన్నారు. టాప్ 5 కంటిస్టెంట్లుగా ఈ ఐదుగురి నడుమ గట్టి పోటీ నెలకొంది. వీరిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు కాబోతున్నారనే దానిపై ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ నెలకొంది.
5/ 8
అయితే తొలి ఎపిసోడ్ కు అనుకున్న స్థాయిలో రేటింగ్స్ రాకపోవడంతో.. ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిందట బిగ్ బాస్ టీమ్. ఎలాగైనా రికార్డ్ స్థాయిలో రేటింగ్ అందుకోవాలనే కోణంలో సన్నాహాలు చేసిన మేనేజ్మెంట్ బాలయ్య బాబును రంగంలోకి దించబోతోందని సమాచారం.
6/ 8
బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణను ఇన్వైట్ చేసిందట టీమ్. భారీ స్థాయిలో ఈ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా బిగ్ బాస్ ఫైనల్ అంగరంగ వైభవంగా ప్లాన్ చేసిన టీమ్.. అందుకోసం ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు టాక్.
7/ 8
ప్రస్తుతం వీర సింహా రెడ్డి సినిమాతో బిజీగా ఉన్నారు బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరోవైపు అన్ స్టాపబుల్ షోతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఈ పరిస్థితుల్లో బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణ వస్తారా లేదా అనే డౌట్స్ అందరిలో నెలకొన్నాయి.
8/ 8
బిగ్ బాస్ టీమ్ మాత్రం ఈ సారి విజేతకు బాలయ్య చేతుల మీదుగానే బిగ్ బాస్ 6 తెలుగు ట్రోఫీ అందించాలని భావిస్తున్నారట. ఇలా అయితే భారీ టీఆర్ఫీ సాధించవచ్చనేది టీమ్ ఆలోచనగా తెలుస్తోంది. సో.. చూడాలి మరి ఈ బిజీ షెడ్యూల్ లో బాలయ్య బాబు బిగ్ బాస్‌పై ఏ మేర ఇంట్రెస్ట్ చూపుతారనేది!.