Bigg Boss OTT : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ముగిసింది. ఇక ఐదవ సీజన్’లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలిచారు. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవస్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు షో గత ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో అట్ఠహాసంగా ప్రారంభమైంది. నో కామా.. నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్గా బిగ్‌బాస్ ఓటీటీని నిరంతరాయంగా 84 రోజులు పాటు ఏకధాటిగా ప్రసారం అవుతోంది. (Twitter/Photo)
అత్యంత ఆసక్తి కలిగించే హౌస్మేట్స్ కలిగిన బిగ్‌బాస్ హౌస్ ఈ సారి మీ చూపు తిప్పుకోనీయదు అంటూ హామి ఇచ్చింది. తెలుగు టీవీ అభిమానులు ఇప్పుడు వినోదాన్ని మరో స్థాయిలో ఆస్వాదించే రీతిలో బిగ్‌బాస్‌ను తీర్చిదిద్దారు.లక్షలు ఖర్చు పెడుతూ బిగ్‌బాస్ అనే గేమ్ గెలిచెయ్యాలని ఒకరిపై మరొకరు డిజిటల్ మీడియాని అడ్డం పెట్టుకుని బురదని చల్లటానికి బాగానే కుస్తీ పడుతున్నారని బయట ఫేస్‌బుక్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌లలో తెలిసి పోతుంది.(Twitter/Photo)
నటరాజ్ మాస్టర్ బిందు ఉన్న నిన్నటి బిగ్‌బాస్ ప్రోమోలో సమ్మర్లో కంటే ఎక్కువ హీట్ కనిపించింది. లోపల కష్టపడి గెలవటానికి సోల్జర్స్లా ఆడే బలమైన దమ్మున్న కంటెస్టెంట్స్ ఉన్నారు. కానీ బయట బిందు భజన బాగా ఎక్కువైందని లోపల వాళ్లకి బిగ్‌బాసే ఉప్పందించాడు. అదికాస్త స్ట్రాంగ్‌గా ఆడే స్ట్రాంగ్ గేమర్ నటరాజ్ మాస్టర్‌కి అర్థమైపోయినట్టుంది. (Twitter/Photo)
అందుకే తేడాలొస్తే వెనకా ముందు ఆలోచించక స్ట్రైట్‌గా మాట్లాడేసే నటరాజ్ మాస్టర్ ముందు బిందు తట్టుకోలేకపోయింది. ఎందుకంటే పాపం ఆ పిల్ల కష్టపడి ఆడే టాస్క్‌లకి దూరం అని అందరితో అనిపించుకుంది. కానీ నటరాజ్ మాస్టర్ కిల్లర్ టాస్క్ దగ్గర నుంచి ప్రతి టాస్క్‌లలో ఈ ఆట గెలవకపోతే పరువు పోతుందన్నట్టు చెడుగుడు ఆడేసి అందరి మనస్సులు గెలుస్తున్నాడు. (Twitter/Photo)
అతనితోపాటు శివ, అఖిల్, అరియాన, మిత్ర ఉండగా ఈ సుఖజీవి బిందు బయట నుంచి ‘పైసామే పరమాత్మ’ అంటూ సుఖీభవ అనిపించుకుంటే లోపల కంటే బయటే ఆవిడ చాలా స్ట్రాంగ్‌గా ఆడుతుందని అర్థమై ఆమెపై కౌంటర్లు మొదలెట్టారు. కష్టపడకపోయినా నేనే గెలుస్తానని బిందుకి ముందే తెలిసినట్టు తాపీగా ఉంటుంది తప్ప కంగారుపడట్లేదు. బిందు సుఖీభవ.. ఇతర కంటెస్టెంట్లు కష్టే ఫలే అంటున్నారు. (Twitter/Photo)