Bigg Boss OTT : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ముగిసింది. ఇక ఐదవ సీజన్’లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలిచారు. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవస్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు షో గత ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో అట్ఠహాసంగా ప్రారంభమైంది. నో కామా.. నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్గా బిగ్‌బాస్ ఓటీటీని నిరంతరాయంగా 84 రోజులు పాటు ఏకధాటిగా ప్రసారం కానుంది. ఇందులో అందరి దృష్టి ఆకర్షిస్తోన్నది మిత్రా శర్మ. (Twitter/Photo)
శేఖర్ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రాజశేఖర్, ఆయన సతీమణి, దర్శకురాలు జీవిత బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టారు. అయితే కంటెస్టెంట్లకు రకరకాల టాస్క్‌లు ఇస్తూ.. వారిలోని ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఒక యాక్టింగ్ స్కూల్లో సీటు వస్తే ఎలా స్పందిస్తారు.. సీటు రాకపోతే ఎలా ఫీలవుతారు అనే థీమ్ ఆధారంగా నటించి చూపమన్నారు. దాంతో మిత్రా శర్మ వచ్చి తనదైన శైలిలో రకరకాల భావాలు పలికిస్తూ నటించి చూపించారు.