Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఐదవ సీజన్’లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలిచారు. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవస్థానం దక్కించుకున్నారు. కాగా ఈ సీజన్ ఫినాలే ఈవెంట్లో నాగార్జున మరో రెండు నెలల్లో సరికొత్త బిగ్ బాస్ సీజన్ ఓటీటీ మొదలు కానుందని ప్రకటించారు. తాజాగా ఈ షోకు సంబంధించిన తెలుగు ఓటీటీ లోగోను విడుదల చేశారు. (Twitter/Photo)
డిస్నీ హాట్ స్టార్ వేదికగా ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ త్వరలోనే ప్రసారం కానుంది. అత్యంత ఆసక్తి కలిగించే హౌస్మేట్స్ కలిగిన బిగ్‌బాస్ హౌస్ ఈ సారి మీ చూపు తిప్పుకోనీయదు అంటూ హామి ఇచ్చింది. తెలుగు టీవీ అభిమానులు ఇప్పుడు వినోదాన్ని మరో స్థాయిలో ఆస్వాదించే రీతిలో బిగ్‌బాస్ రూపుదిద్దుకుంటుంది. (Twitter/Photo)
Bigg Boss Telugu: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు, ఐదు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. Photo : Instagram
అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సరికొత్త బిగ్ బాస్ తెలుగు OTTలో పాల్గొనడానికి జబర్దస్త్ యాంకర్ వర్షిణిని సంప్రదించినట్లు సమాచారం అందుతోంది. అందులో భాగంగా ఆమె ఈ షోలో పాల్గోనేందుకు ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది. యాంకర్ వర్షిణితో పాటు మరో యూట్యూబ్ యాంకర్ శివ కూడా ఫైనల్ అయ్యారని అంటున్నారు. Photo : Instagram
ఈ ఇద్దరితోపాటు ఈటీవీలో వచ్చే డాన్స్ ప్రోగ్రామ్ ఢీ 10 విన్నర్ రాజు కూడా బిగ్ బాస్ ఓటీటీలో పాల్గోననున్నారని అంటున్నారు. వీరితో పాటు మరో సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య కూడా ఫైనల్ అయ్యినట్లు సమాచారం అందుతోంది. వైష్ణవి చైతన్య పలు వెబ్ సిరీస్‌లో నటించారు. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి సాఫ్ట్ వేర్ డెవలపర్స్ వెబ్స్ సిరీస్‌లో నటించారు. అయితే కంటెస్టెంట్స్ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Instagram
తెలుస్తోన్న సమాచారం మేరకు బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ నిర్వాహణను ప్రముఖ టీవీ తెర యాంకర్ ఓంకార్ నిర్మాణ సంస్థ ‘ఓక్ ఎంటర్టైన్మెంట్స్’కు అప్పజెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ షోకు హోస్ట్‌గా యాంకర్ ఓంకార్ వ్యవరించనున్నారని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. Photo : Instagram
త్వరలో డిస్నీ హాట్ స్టార్ ఓటిటిలో బిగ్ బాస్ షోలో చాలా మంది పాత కంటెస్టెంట్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి సీజన్ నుంచి ఐదో సీజన్ వరకు బిగ్ బాస్ షోలో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసుకొని.. వాళ్లని ఇప్పుడు ఓటీటీ కోసం మరోసారి ఇంట్లోకి పంపిస్తున్నారట. వాళ్లతో పాటు మరికొందరు కొత్త వాళ్లను కూడా ఎంపిక చేశారు. ఫిబ్రవరి 26 నుంచి ఈ సీజన్ మొదలు కానున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆ 16 మంది కంటెస్టెంట్స్ ఎవరో ఒకసారి చూద్దాం..
అశు రెడ్డి: బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో జూనియర్ సమంతగా అడుగు పెట్టింది ఆశు రెడ్డి. అందులో ఫుల్ గ్లామర్ షోతో చేసి స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న అశు రెడ్డి.. మరోసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రోడ్ రైడా: నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో రోల్ రైడ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన హిప్-హాప్ రాకింగ్ మ్యూజిక్‌తో ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బయటికి వచ్చిన తర్వాత అల వైకుంఠపురంలో లాంటి సినిమాలలో కూడా ర్యాప్ పాడాడు రోల్ రైడ. బిగ్ బాస్ ఓటిటి కోసం ఈయన కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.
హమీద: బిగ్ బాస్ సీజన్ 5 చూసిన వాళ్ళకు హామీద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా సింగర్ శ్రీరామచంద్రతో ఈమె లవ్ ట్రాక్ అదిరిపోయింది. బయటికి వచ్చిన తర్వాత కూడా శ్రీరామ్ అంటే తనకు ఇష్టమని చెప్పింది హమీద. కేవలం ఐదు వారాలు మాత్రమే ఉన్నా కూడా అద్భుతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె మరోసారి బిగ్‌బాస్ ఇంట్లోకి వస్తుంది.