Ariyana Glory : అరియానా గ్లోరి యూట్యూబ్‌లో యాంకర్‌గా సత్తా చాటుతున్న సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అలా బిగ్ బాస్ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇక ఆ తర్వాత నుంచి ఇటు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు యూట్యూబ్‌లో ఛానల్ నడుపుతూ అదరగొడుతోంది. ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొత్త కారు కొనింది. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Photo : Instagram
కొత్త కారుతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో అభిమానులతో పాటు, పలువురు సెలబ్రిటీలు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని కియా షోరూమ్ నుంచి కొత్తగా కొనుగోలు చేసిన కియా కారును ఇంటికి తీసుకొచ్చినందుకు గాల్లో తేలిపోతుందీ అరియానా. అరియానా తన ఫ్రెండ్స్ సోహైల్, టీవీ నటుడు అమర్‌దీప్‌లతో కొత్తకారులో షికారుకు వెళ్లారు. Photo : Instagram
ఇక ప్రస్తుతం అరియానా బిగ్‌బాస్ బజ్ సీజన్ ఐదుకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. ప్రతి వారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ను అరియానా ఇంటర్వూ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే మొదటి వారం ఎలిమినేట్ అయిన సరయూను, ఆ తర్వాత సెకండ్ వారం ఎలిమినేట్ అయిన కార్తీక దీపం ఉమా దేవిని అరియానా ఇంటర్వూ చేసింది. ఇలా ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు కూడా చేస్తూ బిజీబిజీగా మారింది అరియానా. Photo : Instagram
అరియానా తెలంగాణలోని తాండూరు నుంచి వచ్చి.. హైదరాబాద్ వచ్చి పడరాని కష్టాలన్నీ పడింది. ఆ తర్వాత ఎలాగోలా యూ ట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలతో ఫేమస్ అయింది. ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీ అయిపోయింది. బిగ్ బాస్ పుణ్యమా అని అమ్మడు రేంజ్ కూడా పెరిగిపోయింది. అరియానా అంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా గుర్తు పట్టేస్తారు. అంత ఫేమస్ అయిపోయింది. పైగా అవినాష్‌తో ఈమె వ్యవహారం కూడా అరియానాను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేసింది. Photo : Instagram
ఇక్కడ విశేషం ఏమంటే అరియానా ముక్కు అవినాష్‌లు పెళ్లి చేసుకుంటారని అందురూ అనుకున్నారు. అయితే అలాంటిదేమీ లేదని తేలిపోయింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ డుఅవినాష్ తాజాగా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. మీరు అందరు ఎప్పటి నుండో పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. నా అనూజను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ అవినాష్ తనకు కాబోయే భార్య ఫోటోలను పంచుకున్నారు. Photo : Instagram
జబర్దస్త్ క్రేజ్ వల్ల అవినాష్‌కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందు. హౌజ్‌లో ఉన్న సమయంలో అరియానాతో కొంత క్లోజ్‌గా మూవ్ అయ్యారు. దీంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం జరిగింది. బయటకు వచ్చాక కూడా అరియానా అవినాష్‌లు వివిధ రకాల షోలకు అటెంట్ అయ్యి హల్ చల్ చేశారు. దీంతో వీరి అభిమానులు అంతా ఈ ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అని భావించారు. అయితే అదంతా జస్ట్ ప్రమోషన్, పబ్లిసిటీ కోసమే అని తెలుస్తోంది. Photo : Instagram