Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్ విజయవంతంగా నడుస్తోంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. Photo :Twitter
ఇది ముఖ్యంగా చెవి లోపలి భాగంలో బ్యాలెన్స్ సమస్యలు రావడం వెర్టిగో వచ్చే అవకాశం ఉంది. మైగ్రేన్ వల్ల కూడా వర్టిగో వచ్యే ఆస్కారం ఉంది. దీనికి చికిత్స ఏమంటే... కొందరికి వచ్చి పోతుంది..కానీ కొందరికి మాత్రం డాక్టర్ సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుందట. ఇక మరీ సీరియస్ గా ఉంటే మాత్రం వైద్యుల సర్జరీ చేస్తారు. Photo :Twitter
వర్టిగో వంశ పారంపర్యంగా కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనికి తోడు మెదడు ఎక్కువగా ఒత్తిడికి గురైనా వర్టిగో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జెస్సీ విషయానికి వస్తే.. జెస్సీకి గతంలో ఇలాంటీ సమస్యలు రావడం చూడలేదని .. ఆయన ఆరోగ్యంగానే ఉండేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Photo : Instagram
ఇక బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన సభ్యుల విషయానికి వస్తే.. ప్రతీసారి 16 మంది ఇంటి సభ్యులు వచ్చేవాళ్లు అయితే ఈ సారి మాత్రం మరో ముగ్గురిని ఎక్స్ ట్రా తీసుకొచ్చారు. ఈ సారి ఇంటిని 19 మంది సభ్యులతో నింపారు. ఇప్పటి వరకు ఏడుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. Photo : Instagram