Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్ విజయవంతంగా నడుస్తోంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. Photo :Twitter
విశ్వ తొమ్మిదవ వారం వరకు ఇంట్లో ఉండి.. తన టాస్క్‌లతో అదరగొట్టారు. మిస్టర్ ఫర్పెక్ట్గా హీరో ఆఫ్ హౌస్‌గా పేరు తెచ్చుకున్న విశ్వ ఇలా సడెన్‌గా ఎలిమినేట్ అవ్వడం చాలా మంది బిగ్ బాస్ అభిమానులకు రచించలేదు. ఇదేంటీ ఇలా జరిగింది.. టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఇలా తొమ్మిదవ వారంలో బయటకు రావడం ఏంటీని తెగ చర్చించుకుంటున్నారు. Photo : Instagram
ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ షో ఏమైనా స్క్రిప్టెడ్ షోనా అంటూ ఆరాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్యూలో విశ్వ ఈ విషయంలో కండ బద్దలు కొట్టారు. చిన్న చిన్న కారణాలతో ఒకరిని ఒకరు నామినేషన్ చేయడం లేదా.. పెద్దగా కారణం లేకుండానే గొడవలు పడడం.. ఇలా కొన్ని విషయాల వలన.. బిగ్ బాస్ హౌస్ లో జరిగే సంఘటనలు చూసీ రియాల్టీ షోలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అన్న ఒక టాక్ నడుస్తోంది. Photo : Instagram
అయితే ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు విశ్వ... ఆయన మాట్లాడుతూ.. అందరూ మామూలుగా అంటూ ఉంటారు ఈ షో స్క్రిప్టెడ్ షో అని కానీ... అది వాస్తవం కాదు.. ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో జరిగేవన్నీ కూడా నిజంగా జరిగేవే, స్క్రిప్టెడ్ కాదు అంటూ కుండ బద్దలు కొట్టారు విశ్వ. దీంతో ఈ విషయంలో చాలా మంది ప్రేక్షకులకు క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. Photo : Instagram
ఇంకా ఆయన మాట్లాడుతూ బిగ్ బాస్ తెలుగు 5 సీజన్లో టైటిల్ విన్నర్‌గా శ్రీ రామచంద్ర అవుతాడని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తాను బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి రావడం నాతోపాటు నన్ను ఆదరించిన వారికి నమ్మకం కుదరలేదని.. ఆశ్చర్యానికి గురి చేసిందని ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. Photo : Instagram
ఇక బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన సభ్యుల విషయానికి వస్తే.. ప్రతీసారి 16 మంది ఇంటి సభ్యులు వచ్చేవాళ్లు అయితే ఈ సారి మాత్రం మరో ముగ్గురిని ఎక్స్ ట్రా తీసుకొచ్చారు. ఈ సారి ఇంటిని 19 మంది సభ్యులతో నింపారు. ఇప్పటి వరకు ఏడుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. Photo : Instagram