బిగ్ బాస్ హౌజ్‌లో చివరి వరకు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు సన్నీ. బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలేలో ఓటింగ్ పరంగా దాదాపు 50 శాతం ఆయనకు పడినట్లు తెలుస్తోంది. ఇక తర్వాత 30 శాతం ఓటింగ్ షణ్ముఖ్ దక్కించుకున్నారని తెలుస్తోంది. ఇక సన్నీకి బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ ట్రోపీతో పాటు 50 లక్షల క్యాష్ ప్రైజ్, షాద్ నగర్లో సువర్ణభూమి నుంచి 25 లక్షల ఫ్లాట్, ఓ టీవీయస్ బైక్ బహుమతులుగా గెలిచారు. Photo : Twitter
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలేలో నాగార్జున బ్లాక్ డ్రెస్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున మిర్చీ మూవీలోని బార్బీ గాల్ పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తూ అలరించారు. తర్వాత ఐదో సీజన్ 14 మంది ఎక్స్ కంటెస్ట్‌లను ఆహ్వానించారు. వారు తమదైన స్టైల్‌తో డ్యాన్స్ చేసి అలరిస్తారని చెప్పారు. ఇక వరుసగా ఎక్స్ కంటెస్టెంట్స్ డాన్స్‌లు వేశారు. అందులో భాగంగా అనీ, నటరాజ్ మాస్టర్లు ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్‌కు ఇరగదీశారు. ఆ తర్వాత నాగార్జున ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన అందరిని పిలుస్తూ.. ఎవరు మీ ఫేవరేట్ కంటెస్టెంట్ అడుగుతున్నారు. Photo : Instagram
ఇక బిగ్ బాస్ ఫినాలేలో భాగంగా సిరి ఎలిమినేట్ అయ్యారు. ఈ ఎలిమినేషన్ కోసం బిగ్ బాస్ హౌస్ మీద 5 డ్రోన్స్ తిరిగాయి. ఒక్కో డ్రోన్ మీద ఒక్కొక్క కంటెస్టెంట్ ఫోటోను ఏర్పాటు చేశారు బిగ్ బాస్. ఒక్క డ్రోన్ మాత్రం హౌస్ నుంచి బయటికి వెళ్లిపోతుంది. అది సిరి డ్రోన్. దీంతో సిరి ఎలిమినేషన్ అయ్యిందని పేర్కోన్నారు నాగార్జున.. Photo : Instagram
ఫైనల్ కంటెస్టెంట్లలో సిరి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక టాప్ 4లో ఉన్న వారిలో మానస్ ఎలిమినేట్ అయ్యారు. గెస్ట్‌గా వచ్చిన నానితో ఒక సూట్‌కేస్ పంపిస్తాడు బిగ్ బాస్. ఆ సూట్‌కేస్‌లో బిగ్ ఎమౌంట్ ఉందని.. అది కావాలంటే ఎవరైనా తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోవచ్చని చెబుతారు నాని. కానీ.. ఎవ్వరూ సూట్‌కేస్ తీసుకోవడానికి ఒప్పుకోరు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ మానస్ ఎలిమినేట్ అయ్యారని అంటారు. దీంతో ఇంట్లో టాప్ 3లో శ్రీరామ్, షణ్ముఖ్, సన్నీ ఉంటారు. Photo : Twitter
Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్ విజయవంతంగా నడుస్తోంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఈ ఐదవ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. Photo : Instagram
ఇప్పటికే పద్నాలుగు మంది ఎలిమినేట్ అవ్వగా.. చివరగా ఇంటి నుంచి కాజల్ బయటకు వచ్చారు. ఎంతో స్ట్రాంగ్ అనుకున్న కాజల్ హౌస్ నుంచి వెళ్లిపోవడం అటు ఇంటిసభ్యులతో పాటు ఇటు బిగ్ బాస్ చూసే వారిని సైతం షాకింగ్‌కు గురిచేసింది. ఇక బిగ్ బాస్ ఐదవ్ సీజన్ చివరి దశకు చేరుకుంది. దాదాపు 106 రోజుల ప్రయాణం తరువాత బిగ్ బాస్ ఫినాలే ఘట్టంతో ముగిసింది. . Photo : Instagram
ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు విజేతగా నిలుస్తారు. ఇంట్లో ఉన్న వారిలో శ్రీరామ్, సన్ని, సిరి, షణ్ముఖ్, మానస్ ఉండగా.. వీరిలో శ్రీరామ్ లేదా సన్ని విజేతలుగా నిలువునున్నారని తెలుస్తోంది. ఈ ఐదుగురిలో రేపు విన్నర్ ఎవరన్నది రేపు అధికారికంగా తేలనుంది. అయితే ఇంట్లో ఉన్న వారిలో సన్నీ, షణ్ముఖ్‌కు ఎక్కువగా ఓట్లు పడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. Photo : Instagram
లేటెస్ట్గా తెలుస్తోన్న సమాచారం మేరకు షన్ను కంటే సన్నీకి ఎక్కువగా ఓట్లు వస్తున్నాయని అంటున్నారు. దీంతో సన్నీ టైటిల్ విన్నర్ అవ్వచ్చని టాక్ నడుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు హౌజ్ నుంచి సిరి, మానస్లు ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. సిరి, మానస్లు ఎలిమినేట్ అవ్వగా.. మిగిలిన వారిలో సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ టాప్ త్రీలో ఉంటారు. వీరిలో సన్నీ ఓట్ల పరంగా లీడింగ్‌లో ఉన్నారని టాక్. దీంతో టాప్ లో 2లో శ్రీరామ్, ఆతర్వాత షణ్ముఖ్ ఉన్నారని సమాచారం. Photo : Instagram
ఇక గ్రాండ్ ఫినాలే ఈరోజు అంటే డిసెంబర్ 19 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం మొదలైంది. దాదాపు 106 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్‌లో సిరి, మానస్లు ఎలిమినెట్ అవ్వగా.. మిగతా ముగ్గురులో ఇద్దరు స్టేజీపైకి వస్తారు. అందులో ఒకరు విజేతగా నిలువనున్నారనేది తెలిసిందే. Photo : Twitter
ఇక ఈ సారి ఇంటిని 19 మంది సభ్యులతో నింపారు. ఇప్పటి వరకు ఏడుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. ఆరవ వారంలో శ్వేతా వర్మ ఏడవ వారంలో ప్రియా, ఎనిమిదవ వారంలో లోబో, ఇక తాజాగా తొమ్మిదవ వారంలో విశ్వ ఎలిమినేట్ అయ్యారు. Photo : Instagram
పదవవారంలో జెస్సీ ఆరోగ్యం బాగలేక ఇంటి నుంచి బయటకు వచ్చారు. పదకొండోవారంలో అనీ, పన్నెండో వారంలో రవి బయటకు వచ్చారు. పదమూడో వారంలో ప్రియాంక, పద్నాలుగో వారంలో కాజల్ ఎలిమినేట్ అయ్యారు. ఇక మరోవైపు ఈసారి బిగ్ బాస్ షో పెద్దగా ఆకట్టుకోవట్లేదని అంటున్నారు కొందరు నెటిజన్స్. హౌజ్‌లో పెద్దగా వేడి లేదని.. అంతా చప్పగా నడుస్తోందని టాక్ నడుస్తోంది. టాస్క్‌లు కూడా లాస్ట్ సీజన్లో చేసినవే ఉన్నాయని.. అవే పునరావృతమవుతున్నాయని అంటున్నారు. Photo : Instagram