జులై రెండో వారంలో బిగ్ బాస్ తెలుగు 5 ప్రారంభముతుందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి అడుగులు పడలేదు. ఐతే ఇప్పుడిప్పుడే కంటెస్టంట్ల ఎంపికపై నిర్వాహకులు దృష్టిసారించారని తెలుస్తోంది. అన్నీ కుదిరితే సెప్టెంబరు 5 నుంచి బిగ్ బాస్ తెలుగు 5ని ప్రారంభించవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇక బిగ్‌బాస్ 5లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. యాంకర్ వర్షిణి, గాయని మంగ్లీ, కమెడియన్ ప్రవీణ్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, న్యూస్ యాంకర్ ప్రత్యూష, యాంకర్ శివ, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్, టీవీ సెలెబ్రిటీ దీపికా పిళ్ల, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే హైపర్ ఆది, శేఖర్ మాస్టర్, సింగర్ మంగ్లీ బిగ్‌బాస్‌కు వెళ్లకపోవచ్చే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీరు ముగ్గురూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిని పక్కనబెట్టి బిగ్‌బాస్‌లోకి వెళ్లే సాహసం చేయకపోవచ్చని నెటిజన్లు అభిప్రాయడపడుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)