Dethadi Harika : హారిక... యూట్యూబ్ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఈ వెబ్ సిరీస్‌తో హారికకు నెటిజన్లలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకంది. ప్రస్తుతం హారిక చేసే 'దేత్తడి' యూట్యూబ్ చానెల్‌కు (మిలియన్) 10 లక్షలకు వరకు సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
Dethadi Harika : ఇక తాజాగా హారికను తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి ఇటీవల ఓ ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత వెంటనే ఆమెను టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించినట్లు వార్తలు రాగా.. తాజాగా వస్తోన్న సమాచారం మేరకు అలాంటీది ఏమి లేదని తెలుస్తోంది. Photo: Instagram.com/alekhyaharika