BIGG BOSS TELUGU 3S WILD CARD CONTESTANT TAMANNA SIMHADRI ALL YOU NEED TO KNOW ABOUT THE FIRST TRANSGENDER CONTESTANT IN THE SHOW MS
Big Boss Telugu 3 : హౌజ్‌లోకి తమన్నా సింహాద్రి.. అసలు ఎవరీమె?
విజయవంతంగా రెండు సీజన్స్ పూర్తి చేసుకుని ఇటీవలే ప్రారంభమైన బిగ్‌బాస్-3 రసవత్తరంగా సాగుతోంది. మొదటివారంలో నటి హేమ ఎలిమినేషన్‌కు గురై హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు హేమ స్థానంలో తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్‌జెండర్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి పంపించారు. దీంతో అసలు తమన్నా సింహాద్రి ఎవరు? అన్న చర్చ జనంలో మొదలైంది. ఈ నేపథ్యంలో తమన్నా సింహాద్రికి సంబంధించిన వివరాలు మీకోసం..
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జరిగిన ఏపీ ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై తమన్నా పోటీ చేశారు.
2/ 5
తమన్నా సింహాద్రి స్వస్థలం కృష్ణ జిల్లా అవని గడ్డ. ఆమె అసలు పేరు సింహాద్రి మస్తాన్. వీరిది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. టీడీపీ సీనియర్ నేత,మాజీ దేవాదాయ శాఖ మంత్రి సింహాద్రి సత్యనారాయణ తమన్నాకు పెద్దనాన్న అవుతారు.
3/ 5
యూపీలోనే కాదు, ఏపీలో కూడా ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి పోటీలో ఉన్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తమన్నా సింహాద్రి పోటీ చేస్తున్నారు.
4/ 5
సినిమాల్లో రాణించాలన్న కోరికతో కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చిన తమన్నా.. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో ముంబైకి కూడా వెళ్లారు. అక్కడే లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు.
5/ 5
ముంబైలోనే కొన్నాళ్లు జాబ్ చేసిన తమన్నా.. వి కేర్ కంపెనీ నిర్వహించిన ఓ ఫ్యాషన్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు.శ్రీరెడ్డి చేపట్టిన కాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి మద్దతుగా ఉండి వార్తల్లో నిలిచారు.