Bigg Boss 6 క్రేజీ అప్డేట్.. హౌస్ లోకి ఒకప్పటి హీరో! భారీ ఆఫర్ ఇచ్చేశారట..
Bigg Boss 6 క్రేజీ అప్డేట్.. హౌస్ లోకి ఒకప్పటి హీరో! భారీ ఆఫర్ ఇచ్చేశారట..
తెలుగులో ఇప్పటి వరకు విజయవంతంగా ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షోను ఇటీవలే ఓటీటీలోకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఈ షో సీజన్ 6 కోసం సమాయత్తమవుతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది.
బుల్లితెరపై ప్రసారమయ్యే షోలన్నింటిలో ప్రత్యేకం అనిపించుకుంది బిగ్ బాస్. తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ షో బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. ఆడియన్స్ నుంచి భారీగా రెస్పాన్స్ అందుకుంటున్న ఈ షో సీజన్ బై సీజన్ మరింత రసవత్తరంగా మారుతుండటం చూస్తూనే ఉన్నాం
2/ 7
తెలుగులో ఇప్పటి వరకు విజయవంతంగా ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షోను ఇటీవలే ఓటీటీలోకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఈ షో సీజన్ 6 కోసం సమాయత్తమవుతోంది.
3/ 7
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కంటిస్టెంట్స్ విషయమై ప్రత్యేక శ్రద్ద పెడుతూ షోని రక్తి కట్టిస్తున్నారు నిర్వాహకులు. సెలబ్రిటీలందరినీ ఒకేచోట చేసే అవకాశంతో పాటు వారి వారి ఆట, పాట, ఎంజాయ్ మూమెంట్స్ అన్నీ బుల్లితెర ఆడియన్స్ ముందు ఉంచుతున్నారు.
4/ 7
‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ అంటూ ఓటీటీ వేదిక పైకి వచ్చిన బిగ్ బాస్ షో ఆరో సీజన్‌ని మరింత రసవత్తరంగా మార్చాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే కంటిస్టెంట్ల ఎంపిక ప్రక్రియ షురూ అయిందని సమాచారం.
5/ 7
ఆగస్ట్ నెలలో కానీ, సెప్టెంబర్ నెలలో కానీ బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయిందని తెలుస్తోంది. అయితే కంటిస్టెంట్స్ విషయంలో వినిపిస్తున్న కొన్ని పేర్లు షో పట్ల ఆసక్తి రేపుతున్నాయి.
6/ 7
బిగ్ బాస్ సీజన్ సిక్స్‌లో పాల్గొనేది వీళ్ళేనంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ లిస్ట్‌లో హీరో వడ్డే నవీన్ పేరు బాగా వినిపిస్తోంది. ఒకానొక సమయంలో హీరోగా సక్సెస్ అయిన ఆయనకు భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట.
7/ 7
ఇదే నిజమైతే సీజన్ 6కి వడ్డే నవీన్ స్పెషల్ అట్రాక్షన్ అవుతాడని చెప్పుకోవచ్చు. నవీన్‌తో పాటు సీజన్- 6 లిస్ట్‌లో హైపర్ ఆది, దీప్తి పిల్లి, వర్షిణి, యాంకర్ ధనుష్ లాంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.