గతంలో పోల్చితే బిగ్ బాస్ సీజన్ 6 మరింత రసవత్తరంగా ఉండాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసమే నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ సారి బిగ్ బాస్ కంటిస్టెంట్స్ వీళ్ళే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల నడుమ జబర్దస్త్ వర్ష పేరు బయటకు రావడం బుల్లితెర ఆడియన్స్లో కుతూహలం పెంచుతోంది.