బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 రియాల్టీ షోలో ఇప్పుడు అంతా కంటెస్టెంట్ శ్రీసత్య గురించే మాట్లాడుకుంటున్నారు. షో బిగినింగ్ నుంచి నాలుగైదు వారాలు సైలెంట్‌గా ఉన్న అమ్మాయి..షడన్‌గా పదో వారం నుంచి చీమ టపాకాయలా పేలుతోందని..సిల్వర్ స్క్రీన్ యాక్టరస్లా మెరిసిపోతోందని టాక్ వినిపిస్తోంది. (Photo Credit:Instagram)
హౌస్మెట్స్ అంతా టఫ్ క్యాండిడెట్స్ కావడంతో ..శ్రీసత్య గేమ్ కంటే గ్లామర్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడుతోందని సోషల్ మీడియా గ్రూప్‌లలో నెటిజన్లు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో ఉన్నట్లుగా శ్రీసత్య వేసుకుంటున్న డ్రెస్‌లు, ఆమె చూసే చూపులు, చేస్తున్న డ్యాన్స్‌లతో తెలిసిపోతోంది. (Photo Credit:Instagram)
ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ఫీమేల్ కంటెస్టెంట్ల ఐదుగురిలో శ్రీసత్యకు సోషల్ మీడియాలో కాస్తో, కూస్తో పట్టుంది. అందుకు తగ్గట్లుగానే ఫాలోయింగ్, గ్లామర్ కూడా ఉండటంతో ఎలాగైనా శ్రీసత్య తన అంద,చందాల్ని ప్రదర్శిస్తోంది. ఈవిధంగానైనా తనకు లైక్‌లు కొట్టి హౌస్‌లో చివరి వరకు ఉంచుతారనే ఫీలవుతున్నట్లుగా కనిపిస్తోంది.(Photo Credit:Instagram)