Bigg Boss 5 Telugu: బుల్లితెరలో త్వరలోనే ప్రసారం కానున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తవ్వగా త్వరలోనే సీజన్ 5 ప్రారంభం కానుంది. అంతేకాకుండా కన్ఫర్మ్ లిస్ట్ కూడా ముందుకు వచ్చేసింది. ఇక తాజాగా స్టార్ మా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా అందులో నాగార్జున బిగ్ బాస్ షో కోసం ఓ పర్ఫామెన్స్ చేసి చూపించాడు. అందులో చెప్పండి బోర్ డమ్ కు గుడ్ బై.. వచ్చేస్తుంది సీజన్ 5 అంటూ ఓ డైలాగ్ కూడా కొట్టాడు. ఇక ఈ షో సెప్టెంబర్ 5 నుండి సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుందని ప్రకటించారు.