Abijeet Duddala: బిగ్ బాస్ సీజన్ ఫోర్ టైటిల్ విన్నర్, సినీ నటుడు అభిజిత్. సినిమాలో నటించిన అభిజిత్ కి అంత గుర్తింపు లేదు. కానీ బిగ్ బాస్ తర్వాత టైటిల్ విన్నర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపై అవకాశాలు అందుకుంటాడని అనుకున్నారు. దురదృష్టం ఏంటో కానీ ఈయనతో పాల్గొన్న కంటెస్టెంట్లు పలు ఆఫర్లతో బిజీగా ఉండగా అభిజిత్ ఇప్పటివరకు ఇండస్ట్రీ అడుగుపెట్టలేదు. వేరే రంగంపై కూడా దృష్టి పెట్టలేదు. ఇక సోషల్ మీడియాతో అభిమానులకు దగ్గరగా ఉన్నాడు. కానీ ఉన్నట్టుండి ఆయన నుండి పోస్టులు రాకపోవడంతో అభిమానుల కోసం తాజాగా సోషల్ మీడియాలోకి వచ్చి షాక్ ఇచ్చాడు. తన భుజంకు గాయం అయిందని హాస్పిటల్ కి వెళ్ళాను త్వరగా తిరిగి వస్తానని ఎమోషనల్ పోస్ట్ చేశాడు. తనకి ఇలా కావడానికి కారణమేంటంటే అవకాశాల కోసం మంచి ఫిజిక్ ను పొందాలని ఇటీవలే వర్కౌట్స్ మొదలుపెట్టాడు. ఇక ఆ వర్కౌట్లే ప్రమాదంలో పడేసిందని తెలుస్తుంది. ఇక ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.