Divi Vadthya: టాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ దివి.. ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. తొలిసారిగా వెండితెరపై నటించిన కూడా అంత పరిచయం లేని ఈ బ్యూటీకి.. ఏకంగా బిగ్ బాస్ షోతో ఎనలేని క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా తన అందంతో ఎంతో మందిని తన వైపు లాక్కుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది. ఇటీవలే ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. నిత్యం ఫోటో షూట్ లతో బిజీగా ఉంటూ.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో కాటుక కళ్ళతో అందమైన స్మైల్ తో ఆకట్టుకుంది. అంతేకాకుండా కళ్ళముందే చెదిరిపోయే కథలకు.. కన్నీరే సాక్ష్యం.. కలతలు అలవాటుపడిన ప్రేమకి 'బందీవి అని అనుకున్నా' ఏమి ఉపయోగం అంటూ ప్రశ్నిస్తూ క్యాప్షన్ పెట్టింది.