Monal Gajjar: బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ ప్రస్తుతం ఎంత క్రేజ్ సంపాదించుకుందో చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు వెండితెరపై గుర్తింపు తెచ్చుకోలేని మోనాల్.. బిగ్ బాస్ తర్వాత వరుస ఆఫర్లతో గుర్తింపు అందుకుంది. ఇక మరో కంటెస్టెంట్ అఖిల్ తో లవ్ పేరుతో రచ్చ చేసి హాట్ టాపిక్ గా మారింది. బయట కూడా అదే రిలేషన్ లో ఉంటూ తెగ సందడి చేస్తున్నారు ఈ జంట. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వీడియో కాల్స్, ఫోటోలతో బాగా రచ్చ చేస్తారు. తాజాగా వీడియో కాల్ లో మాట్లాడిన స్క్రీన్ షాట్ లను షేర్ చేసుకోగా.. అందులో మోనాల్ ను .. అఖిల్ 'గుజ్జులు' అనగా 'అఖిలు' అని రొమాంటిక్ గా పిలిచింది మోనాల్. మరోసారి వీరి ప్రేమ బయటపడగా ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.