Bigg Boss Telugu: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు, ఐదు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. Photo : Instagram
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఐదవ సీజన్’లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలిచారు. రెండవస్థానంలో యూట్యూబర్ షణ్ముఖ్ నిలిచారు. కాగా ఈ సీజన్ ఫినాలే ఈవెంట్ నాగార్జున మరో రెండు నెలల్లో మరో కొత్త బిగ్ బాస్ సీజన్ మొదలు కానుందని ప్రకటించారు. అయితే ఈ కొత్త సీజన్ ఓటీటీ వేదికగా రానుంది. ఈ కొత్త బిగ్ బాస్ ఓటీటీ కార్యక్రమం 82 రోజుల పాటు కొనసాగుతుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ షో 24 గంటలు ప్రసారం కానుంది.
ఈ షో ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానుందని అంటున్నారు. దీంతో అసలు ఈ ఓటీటీలో వచ్చే బిగ్ బాస్ ఎలా ఉండనుంది.. ఈ సీజన్లో పాల్గోనే కంటెస్టెంట్స్ ఎవరు అనే ఆసక్తి అందరిలో మొదలైంది.Photo : Instagram
అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సరికొత్త బిగ్ బాస్ తెలుగు OTTలో పాల్గొనడానికి జబర్దస్త్ యాంకర్ వర్షిణిని సంప్రదించినట్లు సమాచారం అందుతోంది. అందులో భాగంగా ఆమె ఈ షోలో పాల్గోనేందుకు ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది. యాంకర్ వర్షిణితో పాటు మరో యూట్యూబ్ యాంకర్ శివ కూడా ఫైనల్ అయ్యారని అంటున్నారు. Photo : Instagram
ఈ ఇద్దరితోపాటు ఈటీవీలో వచ్చే డాన్స్ ప్రోగ్రామ్ ఢీ 10 విన్నర్ రాజు కూడా బిగ్ బాస్ ఓటీటీలో పాల్గోననున్నారని అంటున్నారు. వీరితో పాటు మరో సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య కూడా ఫైనల్ అయ్యినట్లు సమాచారం అందుతోంది. వైష్ణవి చైతన్య పలు వెబ్ సిరీస్‌లో నటించారు. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి సాఫ్ట్ వేర్ డెవలపర్స్ వెబ్స్ సిరీస్‌లో నటించారు. అయితే కంటెస్టెంట్స్ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Instagram
ఈ సరికొత్త బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ వచ్చే ఫిబ్రవరిలో నెలలో మొదలుకానుంది. ఫిబ్రవరి 6న షో ప్రారంభంకానుందని అంటున్నారు. ఇక గత సీజన్స్‌కు హోస్ట్ చేసిన నాగార్జున.. ఈ సరికొత్త OTT వెర్షన్‌కి కూడా హోస్ట్ ఉండనున్నారని మొన్నటిదాకా టాక్ రాగా.. తాజగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Instagram
తెలుస్తోన్న సమాచారం మేరకు బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ నిర్వాహణను ప్రముఖ టీవీ తెర యాంకర్ ఓంకార్ నిర్మాణ సంస్థ ‘ఓక్ ఎంటర్టైన్మెంట్స్’కు అప్పజెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ షోకు హోస్ట్‌గా యాంకర్ ఓంకార్ వ్యవరించనున్నారని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. Photo : Instagram