బిగ్ బాస్ ఓటిటి తెలుగు వస్తున్న సంగతి చాలా మందికి తెలుసో తెలియదో తెలియదు కానీ అప్పుడే రెండు వారాలు అయిపోతుంది. రెండో వారం ఇంటి నుంచి ఎవరు బయటికి వెళ్లిపోతున్నారనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ బాగానే జరుగుతుంది. నాన్ స్టాప్ షోతో భాగంగా అనుకున్న వ్యూవర్ షిప్ అయితే రావడం లేదనే వాదాన బలంగా వినిపిస్తుంది. అందుకే డోస్ ఇంకాస్త పెంచుతున్నాడు బిగ్ బాస్. రెండో వారం హౌజ్ నుంచి వెళ్లిపోవడానికి ఏకంగా 11 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.
అందులో సీనియర్స్ ఏడుగురు ఉంటే.. జూనియర్స్ నలుగురు ఉన్నారు. మొదటి వారం ఇంటి నుంచి ముమైత్ ఖాన్ వెళ్లిపోయింది. ఈ వారం డేంజర్ జోన్లో ప్రధానంగా ముగ్గురు కంటెస్టెంట్స్ కనిపిస్తున్నారు. కచ్చితంగా ఎవరో ఒకరు వాళ్లలో నుంచే బయటికి వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. సీనియర్స్ అయితే ప్రస్తుతానికి సేఫ్ జోన్లోనే ఉన్నారు. కానీ చివరి వరకు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే.
నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టాలకి సైతం ఈ వారం ఎలిమినేషన్ గండం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటికి వెళ్లిపోతారనేది ఆసక్తికరంగా మారింది. అఖిల్, అరియానా ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఈ ఇద్దరికి టాప్ ఓటింగ్స్ వస్తున్నాయి. ఆ తర్వాత యాంకర్ శివ కూడా మంచి స్థానంలోనే ఉన్నాడు. ఈయనకు ఓటింగ్ బాగానే పడుతుంది. ఇంట్లో ఎంటర్టైనర్ అయిపోతున్నాడు శివ.
దాంతో మనోడి ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అందుకే సేఫ్ జోన్లోకి వచ్చేసాడు. మరోవైపు గ్లామర్ క్వీన్స్ అషూ రెడ్డి, హమీదా సైతం సేఫ్ అవ్వొచ్చు. వాళ్ళ అందాల ప్రదర్శనే వాళ్లకు శ్రీ రామరక్ష. బూతుల సరయు కూడా పర్లేదు అనిపిస్తుంది. ఈమె కూడా ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోలింగ్స్ పరంగా చూస్తే ఈమెకు బాగానే ఓట్లు పడుతున్నాయని తెలుస్తుంది.
సీనియర్స్ జాబితాలో నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టాలు బాగా వెనకున్నారు. వాళ్ళ ఓటింగ్ తక్కువగా ఉంది. జూనియర్స్‌లో మాత్రం అనిల్ రాధోడ్, మిత్రా శర్మా, శ్రీరాపాకకు కాస్త డేంజర్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. అనిల్ ఈ వారం కెప్టెన్ అయ్యాడు. దాంతో ఇప్పుడు సేఫ్ అయితే నెక్ట్స్ వీక్ నామినేషన్స్ నుంచి తప్పించుకుంటాడు. ఈ వారం జూనియర్స్ నుంచి కచ్చితంగా ఎలిమినేషన్ ఉండేలా కనిపిస్తుంది.
మొదటి వారం ముమైత్ వెళ్లిపోయింది కాబట్టి ఈ వారం జూనియర్స్ నుంచి ఒకర్ని పంపిస్తే లెక్క సెట్ అయిపోతుందనే ఆలోచనలో ఉన్నారు ఆడియన్స్ కూడా. ప్రస్తుతానికి వస్తున్న సమాచారం ప్రకారం అయితే అన్ అఫీషియల్ పోలింగ్ ప్రకారం అనిల్ , శ్రీరాపాక, మిత్రా శర్మలకు ఓట్లు తక్కువగా ఉన్నాయి. అయితే ఈ ముగ్గురిలో అనిల్ బయటపడే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ లెక్కన మిత్రా శర్మ, శ్రీరాపాక మధ్యలో ఎలిమినేషన్ ఉండొచ్చని పోల్స్ చెప్తున్నాయి. ఎందుకంటే అనిల్ పెర్ఫామెన్స్ ఈ మధ్య బాగానే ఇంప్రూవ్ అయింది.