బిగ్ బాస్ 5 తెలుగు పూర్తి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే మరో సీజన్ మొదలు కాబోతోంది. ఈసారి టీవీలో కాకుండా ఓటిటిలో బిగ్‌బాస్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా ఉండబోతున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఓటిటి బిగ్ బాస్ షోలో చాలా మంది పాత కంటెస్టెంట్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది.
మొదటి సీజన్ నుంచి ఐదో సీజన్ వరకు బిగ్ బాస్ షోలో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసుకొని.. వాళ్లని ఇప్పుడు ఓటీటీ కోసం మరోసారి ఇంట్లోకి పంపిస్తున్నారు. వాళ్లతో పాటు మరికొందరు కొత్త వాళ్లను కూడా ఎంపిక చేశారు. ఫిబ్రవరి 26 నుంచి ఈ సీజన్ మొదలవుతుంది. ఇప్పటికే ప్రోమో కూడా విడుదలైంది. 24/7 లైవ్ స్ట్రీమింగ్ నడుస్తూనే ఉంటుంది. 84 రోజుల పాటు ఈ ఓటిటి సీజన్ ఉండబోతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆ 17 మంది కంటెస్టెంట్స్ ఎవరో ఒకసారి చూద్దాం..
5. అశు రెడ్డి: బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో జూనియర్ సమంతగా అడుగు పెట్టింది ఆశు రెడ్డి. అందులో ఫుల్ గ్లామర్ షోతో చేసి స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న అశు రెడ్డి.. మరోసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
7. హమీద: బిగ్ బాస్ సీజన్ 5 చూసిన వాళ్ళకు హామీద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా సింగర్ శ్రీరామచంద్రతో ఈమె లవ్ ట్రాక్ అదిరిపోయింది. బయటికి వచ్చిన తర్వాత కూడా శ్రీరామ్ అంటే తనకు ఇష్టమని చెప్పింది హమీద. కేవలం ఐదు వారాలు మాత్రమే ఉన్నా కూడా అద్భుతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె మరోసారి బిగ్‌బాస్ ఇంట్లోకి వస్తుంది.