Bigg Boss Nonstop: బిగ్‌బాస్‌పై సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకి నారాయణ ఏమన్నారు? తమన్నా ఎందుకంత ఫైర్ అయ్యారు?
బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మళ్లీ మొదలైంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రోగ్రామ్ శనివారం నుంచి ప్రారంభమైంది. హాట్ స్టార్ యాప్స్‌లో 24 గంటల పాటు.. ఇది ప్రసారమవుతోంది. మొత్తం 17 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో కొత్తవారితో పాటు పాత వారు కూడా ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఐతే బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రోగ్రామ్ ప్రారంభమైన రోజే సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది బిగ్ బాస్ గేమ్ షో కాదని.. లైసెన్స్ తీసుకున్న బ్రోతల్ హౌస్ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
3/ 5
బిగ్ బాస్ గేమ్ షో కాదని.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఐతే ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. నారాయణపై బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి విరుచుకుపడ్డారు.
4/ 5
ఓ టీవీ డిబేట్లో పాల్గొన్న ఆమె.... బిగ్‌బాస్ షోను బ్రోతల్ హౌస్ అన్నందుకు నారాయణను చెప్పుతో కొట్టాలని అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు తమన్నా. ఈ షో వల్ల తమకు ఎంతో గుర్తింపు వచ్చి.. ఉపాధి కలుగుతోందని అన్నారు. ఒకవేళ ఎవరికైనా షో నచ్చకపోతే ఛానెల్ మార్చుకోవాలని సలహా ఇచ్చారు.
5/ 5
బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో అఖిల్, అరియానా, నట్రాజ్, అషు, సరయు, తేజస్వి, హమీద, ముమైత్ ఖాన్, మహేష్ విట్టా వంటి పాత కంటెస్టెంట్లు కూడా పాల్గొన్నారు. వారితో పాటు ఈసారి కొత్త కంటెస్టెంట్స్ సెలక్షన్ కూడా బాగుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.