తమన్నా ఏంటి.. చెప్పు తీసుకుని కొట్టాలి అని కామెంట్ చేయడం ఏంటి..? అంత కామ్‌గా ఉండే తమన్నా ఎవర్ని టార్గెట్ చేసిందబ్బా అనుకుంటున్నారా..? ఇక్కడ తమన్నా అంటే హీరోయిన్ కాదు.. బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి. బిగ్ బాస్ సీజన్ 3లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి.. కేవలం ఒక్క వారం మాత్రమే ఉంది తమన్నా. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం అక్కడ మామూలు రచ్చ చేయలేదు తమన్నా.
మరీ ముఖ్యంగా సీరియల్ యాక్టర్ రవిని బాగా ఇబ్బంది పెట్టింది ఈ కంటెస్టెంట్. బయటికి వచ్చిన తర్వాత విమర్శల పాలు కూడా అయింది. అయితే ఇ్పపుడు ఈమె సంచలన కామెంట్స్ చేసింది. బిగ్‌బాస్ రియాలిటీ షోతో పాపులారిటీ తెచ్చుకున్న తమన్నా.. ఆ షోను ఎవరైనా ఏదైనా అంటే ఏ మాత్రం సహించేది లేదంటుంది తమన్నా. ఇప్పటి వరకు 5 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. తాజాగా ఓటీటీతో కూడా మొదలైంది.
చాలా మంది పాత కంటెస్టెంట్స్‌ను మళ్లీ ఇందులో తీసుకున్నారు. గత సీజన్స్‌లో వచ్చిన వాళ్లే 10 మందికి పైగా ఉన్నారు. ఇండియాలో అన్ని భాషల్లో బిగ్‌బాస్‌కు ఎంత మంది అభిమానులున్నారో.. అంతేమంది విమర్శకులు కూడా ఉన్నారు. ఈ షో కాన్సెప్టే దరిద్రం అంటూ చాలా మంది కామెంట్ చేసారు. మరీ ముఖ్యంగా కొందరు సినీ ప్రముఖులు కూడా బిగ్ బాస్ షోపై ఘాటు కామెంట్స్ చేసారు.
తాజాగా ఈ షోపై సీపీఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ షో పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ గతంలోనూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు కూడా మరోసారి ఇదే అన్నారు ఈయన. బిగ్‌బాస్ షో అనేది గేమ్ కాదని.. లైసెన్స్ తీసుకున్న బ్రోతల్ హౌస్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నారాయణ. దీనిపై చాలా మంది సీరియస్ అయ్యారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి మండిపడింది. ఈ మధ్యే ఓ టీవీ ఛానెల్ డిబేట్లో పాల్గొన్న ఆమె బిగ్‌బాస్ షోను బ్రోతల్ హౌస్ అన్నందుకు నారాయణను చెప్పుతో కొట్టాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ షోతో తమకు ఎంతో గుర్తింపు వచ్చిందని.. ఈ రోజు కాస్తో కూస్తో సంపాదించుకుని ఉపాధి కలుగుతుందంటే దానికి కారణం బిగ్ బాస్ అని ఆమె అన్నారు.