Bigg Boss Telugu 6 : బిగ్‌బాస్ మూడో సీజన్ నుంచి నాగార్జున.. ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మధ్యలో బిగ్‌బాస్ నాన్ స్టాప్‌కు కూడా ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక మొన్నటి వరకు మా టీవీలో ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్ 6కు ఈయనే హోస్ట్‌గా వ్యవహరించారు. సెప్టెంబర్ 4న అట్టహాసంగా ప్రారంభమైన ఈ షో డిసెంబర్ 18న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌తో కార్ట్ పడింది. మొత్తంగా 106 రోజుల ఈ షో ప్రసారమైంది. తాజాగా బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్‌కు షాకింగ్ టీఆర్పీ రావడం నిర్వాహకులకు షాక్ ఇచ్చింది. (File/Photo)
నాగార్జున (Nagarjuna)కు సీజన్ 6లో ప్రారంభ ఎపిసోడ్‌తో దారుణ పరాభవం ఎదురైంది. ఫస్ట్ ఎపిసోడ్‌తోనే దారుణమైన రేటింగ్ సంపాదించుకుంది ఈ షో. ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన ఈ షో ముందుగా హిందీ ప్రేక్షకులను అలరించింది. ఆ తరవాత నెమ్మది నెమ్మదిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. బిగ్‌బాస్ 6 విజేతగా ప్రముఖ గాయకుడు రేవంత్ నిలిచారు. రన్నరప్‌గా శ్రీహన్ నిలిచారు. (File/Photo)
తెలుగులో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ (NTR Jr )ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సెకండ్ సీజన్‌కు నాచురల్ స్టార్ నాని (Nani) హోస్ట్‌గా ఉన్నారు. ఇక మూడో, నాలుగు, ఐదు, ఆరు సీజన్స్‌కు మాత్రం నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించారు. మధ్యలో ఓటీటీకి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 6వ సీజన్లో కంటెస్టెంట్లలో బాలాదిత్య, అభినయ శ్రీ తప్పించి పెద్దగా ముఖ పరిచయం లేని వాళ్లు ఉండటం గమనార్హం. (File/Photo)
సీజన్ 6 ఫస్ట్ లాంచింగ్ ఎపిసోడ్‌కు 8.86 రేటింగ్ వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన ఐదు సీజన్స్‌లో ఇది దారుణాది దారుణమనే చెప్పాలి. ప్రారంభ ఎపిసోడ్ నుంచి బిగ్‌బాస్ సీజన్ 6 రేటింగ్స్ విషయంలో వెనబడిందనే చెప్పాలి. అందుకే బిగ్‌బాస్ సీజన్ 7కు బాలయ్య లేదా వేరే ఎవరితోనైనా హోస్ట్‌గా పెట్టాలనేది నిర్వహకుల ప్లాన్. (File/Photo)
బిగ్‌బాస్ తొలిసారి టీవీల్లో ప్రసారమైనపుడు ఫస్ట్ ఎపిసోడ్‌కు 16.18 రేటింగ్ వచ్చింది. రెండో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు కాస్త తగ్గి 15.05 వచ్చింది. ఇదే అత్యంత తక్కువ అని చెప్పాలి. ఆ తర్వాత మూడో సీజన్‌కు 17.9 టీఆర్పీ సాధించింది. ఒక రకంగా మూడో సీజన్లో నాగార్జున, ఎన్టీఆర్‌ను బీట్ చేసారనే చెప్పాలి. (Twitter/Photo)
నాల్గో సీజన్ అదిరిపోయే రీతిలో 18.5 టీఆర్పీ సాధించి కెవ్వు కేక పుట్టించింది. మూడు నాలుగు సీజన్స్లకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించినపుడు ఈ ప్రోగ్రామ్‌కు అదిరిపోయే రీతిలో రేటింగ్ వచ్చింది. కానీ ఐదో సీజన్ 15.70 టీఆర్పీ సాధించడంపై అప్పట్లోనే స్టార్ మా నిర్వాహకులకు మింగుడు పడలేదు. సీజన్ 6లో 8.86 వంటి దారుణమైన రేటింగ్ రావడం పై స్టార్ మా నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. (Bigg Boss Telugu 6 logo Twitter)
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్ ఇంప్రెషన్ అన్నట్టు మొదటి లాంఛింగ్ ఎపిసోడ్‌తోనే దారుణమైన ఫలితం రావడంతోనే షో నిర్వహకులు ఒకింత అసహనంతో ఉన్నారు. తాజాగా డిసెంబర్ 18న ప్రసారమైన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు 8.17 రేటింగ్ వచ్చింది. ఇప్పటి వరకు ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్స్‌లో ఇదే దారుణాతి దారుణమైన రేటింగ్. (File/Photo)
ఇక నాని హోస్ట్‌గా వ్యవహరించిన రెండో బిగ్‌బాస్ సీజన్‌కు 15.05 రేటింగ్ దక్కించుకుంది. తొలిసారి తెలుగు టెలివిజన్ తెరపై ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన ‘బిగ్‌బాస్’ సీజన్ 1కు 14.13 టీఆర్పీ వచ్చింది. మొత్తంగా చప్పగా సాగిన బిగ్‌బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకు మాత్రం 8.17 రేటింగ్ సాధించింది. దీంతో రాబోయే సీజన్ 7లో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తారా లేదా అనేది చూడాలి. ప్రేక్షకులకు కూడా నాగార్జున ముఖం చూసి బోర్ కొట్టినట్టుంది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్‌కు గతంలో ఉన్న క్రేజ్ ఇపుడు లేదనే చెప్పాలి. (Twitter/Photo)
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ చిత్ర, విచిత్రంగా సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తిస్తున్నారనే కామెంట్స్ వివిధ వర్గాలు నుంచి వినబడుతున్నాయి. పైగా మన భారతీయ సాంప్రదాయాలను మంట గలిపే ప్రోగ్రామ్ అంటూ కొంత మంది సాంప్రదాయ వాదులతో పాటు కమ్యూనిస్ట్ లీడర్లు కూడా ఈ షోను బ్యాన్ చేయాలంటూ గళమెత్తారు. మొత్తంగా ఇదివరకటిలా ఈ షో అంత కిక్ ఇవ్వడం లేదు. మొత్తంగా బిగ్‌బాస్ సీజన్ 5ను ఎలాగో అలా లాక్కొచ్చిన నాగార్జున ఇపుడు సీజన్ 6ను నాగ్.. ఏ విధంగా విజయ తీరాలకు చేర్చడంలో విఫలమయ్యారు. .(Photo twitter)