బిగ్ బాస్ 5 తెలుగు మొదలై అప్పుడే 5 వారాలు కావస్తోంది. ఇప్పటి వరకు ఎవరు ఏంటి అనేది ఒక ఐడియా ప్రేక్షకులకు కూడా వచ్చింది. పైగా ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ దేశముదుర్లు. కంటెంట్ ఇవ్వడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇంత మంది మధ్యలో ఒక్కడు మాత్రం కాస్త అమాయకంగా కనిపించాడు. వీళ్ళ మధ్యలో ఆయన ఎలా నెట్టుకొస్తున్నాడు అంటూ పాపం ఫ్యాన్స్ కూడా ఫీలయ్యారు.
ఇన్ని రోజుల తర్వాత అతడిలోని అసలు కోణం బయటికి వచ్చింది. ఒకేసారి ఇంట్లోని 8 మంది సభ్యులు నామినేట్ చేసేసరికి స్వాతిముత్యంలా ఉన్న ఆ కుర్రాడు ఒకేసారి అర్జున్ రెడ్డి అయిపోయాడు. అతను ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. యూ ట్యూబ్ స్టార్ట్ షణ్ముఖ్ జస్వంత్. నిన్న మొన్నటి వరకు ఇంట్లో ఉన్నాడా లేడా అన్నట్లే ఉన్నాడు షణ్ముఖ్.
తన పని తాను చేసుకుంటూ.. సిరి, జెస్సితో కలిసి టైంపాస్ చేస్తూ వచ్చాడు. అయితే నామినేషన్ టైం వచ్చినప్పుడు అందరూ ఈ ఒక్క కారణం చెప్పి.. తమతో టైమ్ స్పెండ్ చేయడం లేదు.. షణ్ముఖ్ జస్వంత్‌తో కనెక్షన్ లేదు అంటూ 8 మంది నామినేట్ చేశారు. దాంతో షణ్ముక్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఉన్నట్టుండి గేమ్ స్టైల్ మార్చేశాడు.
ఒక్కసారి నామినేషన్స్‌లోకి వస్తేనే తట్టుకోలేకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే రెడ్ కార్డు వరకు వ్యవహారం వెళ్తుందంటూ వార్నింగులు కూడా వస్తున్నాయి ఈ కుర్రాడికి. రెడ్ కార్డ్ అంటే ప్రేక్షకుల ఓటింగ్‌తో పని లేకుండా నేరుగా హోస్ట్ తనకున్న అధికారంతో ఇంటి నుంచి ఆ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయడం అన్నమాట.