Bigg Boss 5 Telugu : సన్ని సహా ఇప్పటి వరకు బిగ్‌బాస్ టైటిల్స్ గెలిచిన విజేతలు వీళ్లే.. ఏమైతేనేం ఎంతో ఆసక్తికరంగా సాగిన బిగ్‌బాస్ ఐదో సీజన్ అంతే అట్టహాసంగా ముగిసింది. గత 15 వారాలుగా తెలుగు టెలివిజన్ తెరపై మెజారిటీ ప్రేక్షకులను మెప్పించిన రియాలిటీ షో బిగ్‌బాస్. గత సీజన్స్‌తో పోలిస్తే కొద్దిగా టీఆర్పీ రేటింగ్స్ కాస్త వెనకబడిందనే చెప్పాలి. ఐదో సీజన్లో ముందుగా అంతగా అంచనాలేని సన్ని బిగ్‌బాస్ 5 విజేతగా నిలిచారు. (Twitter/Photo)
బిగ్‌బాస్ సీజన్ 5 విజేత సన్ని |బిగ్ బాస్ హౌజ్‌లో చివరి వరకు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు సన్నీ. బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలేలో ఓటింగ్ పరంగా దాదాపు 50 శాతం ఆయనకు పడినట్లు తెలుస్తోంది. ఇక తర్వాత 30 శాతం ఓటింగ్ షణ్ముఖ్ దక్కించుకున్నారని తెలుస్తోంది. ఇక సన్నీకి బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ ట్రోపీతో పాటు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్, షాద్ నగర్లో సువర్ణభూమి నుంచి రూ. 25 లక్షల ఫ్లాట్, ఓ టీవీయస్ బహుమతులుగా గెలిచారు. మొత్తంగా తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా ఐదు సీజన్లు కంప్లీట్ చేసుకుంది.
బిగ్‌బాస్ సీజన్ 4 విజేత అభిజీత్ | బిగ్‌బాస్ సీజన్ 4 విజేతగా నిలిచిన అభిజిత్ పరిస్థితి అలాగే ఉంది. విజేతగా నిలిచిన తర్వాత అభిజిత్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. పైగా ప్యాండమిక్ మూమెంట్ కాబట్టి అంతగా ఛాన్సులు రాలేదనే చెప్పాలి. మరి భవిష్యత్తులో కొత్తగా ఏమైనా అవకాశాలు వస్తాయా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)
| మూడో సీజన్ విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ మాత్రమే కాస్తో కూస్తో వార్తల్లో ఉన్నాడు. ఈయన 90 ML వంటి సినిమాల్లో ఏదో ఒకటి రెండు సినిమాల్లో పాటలు పాడారు. ఇపుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నాటు నాటు సాంగ్‌తో కాస్తో కూస్తో వార్తల్లో ఉన్నారు. అటు కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ’లో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇతను హౌస్‌లో ఉన్నన్ని రోజులు.. పునర్నవితో జరిపిన ఆన్ స్క్రీన్ రొమాన్స్‌తో వార్తల్లో నిలిచాడు.మరోవైపు ఈయన హైదరాబాద్‌లో ఓ బార్లో గొడవ జరగడం.. ఈయనకు తలకు గాయాలవడం వంటి కాంట్రవర్సిలతో పాపులర్ నిలిచాడు.
బిగ్‌బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మందా | బిగ్‌బాస్ 2 విజేతగా నిలిచిన తర్వాత కౌశల్.. ఒకటి రెండు నెలలు మాత్రం కొన్ని షాప్ ఓపెనింగ్స్‌కు రిబ్బన్ కటింగ్‌లు, టీవీ చానెల్స్‌లో ఇంటర్వ్యూలు తప్పించి పెద్దగా కౌశల్ సాధించిదేమి లేదనే చెప్పాలి. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సీజన్ 1, సీజన్ 2 విజేతలుగా నిలిచిన వీళ్లిద్దరిని తెలుగు రాష్ట్రల ప్రజలు దాదాపు మరిచిపోయారనే చెప్పాలి.(File/Photo)
బిగ్‌బాస్ సీజన్ వన్‌లో గెలిచిన శివ బాలాజీకి సినిమాలో పెద్దగా ఏమన్నా చేసాడా అంటే సమాధానం లేదు. గెలిచాకా రెండు మూడు ఛానెల్స్ తిరిగి ఓ వారం రోజులు కాస్తంత హడావుడి చేసాడు. ఆ తర్వాత శివ బాలాజీ ఏం చేసాడన్నది కూడా ప్రజలకు తెలియదు. తెలియదు అనే కంటే అసలు శివ బాలాజీ ఎవరనే విషయం ప్రేక్షకులు కూడా మరిచిపోయారు.బిగ్‌బాస్ హౌస్‌లో వెళ్లే ముందు కాస్తో కూస్తో సినిమాలు చేసే శివ బాలాజీ.. బిగ్‌బాస్ సీజన్ వన్ విజేతగా నిలిచిన తర్వాత ఉన్న ఛాన్సులు కూడా లేకుండా పోయాయి.. (Twitter/Photo)