షణ్ముఖ్, సరయూ.. బయటే అంతా ఫిక్స్ చేసుకుని హౌస్‌లో అడుగుపెట్టారని ఆరోపించింది. సిరి మగాళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతుందని, వీజే సన్నీ తన మీద పగ పెంచుకున్నాడంటూ బిగ్‌బాస్ బజ్ ప్రోగ్రామ్‌లో యాంకర్ అరియానా ముందే కంటెస్టెంట్ల మీద తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో ట్రెండింగ్ మారింది.
అయితే ఆమె ఎలిమినేషన్ కు ప్రధాన కారణం నామినేషన్స్‌లో ఉన్నప్పుడు మిగతా కంటెస్టెంట్లతో పోటీ పడుతూ ఆడాలి. స్క్రీన్ స్పేస్ కోసం ప్రయత్నించాలి. కానీ సరయూ ఈ రెండూ చేయలేదనే తెలుస్తోంది. టాస్క్‌ల మీద కన్నా ఇంటి పనుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రేక్షకులను ఎలా తనవైపు తిప్పుకోవాలి? వారి నుంచి ఎలా ఓట్లు రాబట్టాలి? అన్న విషయాలను ఆమె పెద్దగా పట్టించుకోలేదు.
వీకెండ్ వచ్చేసరికి నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో సరయూ చివరి స్థానంలో ఉంది. హౌస్‌లో యాంకర్ రవి ఎంటర్టైన్ చేయగా హమీదా, మానస్ పవర్ రూమ్ యాక్సెస్ దక్కించుకున్నారు. కాజల్.. అందరి వ్యక్తిగత విషయాలు అడుగుతూ, గొడవ పడుతూ ఏదో ఒక విధంగా స్క్రీన్‌పై కనిపించింది. జెస్సీ.. జైల్లోకి వెళ్లడంతో సింపతీ ఓట్లు సంపాదించాడు. కానీ సరయూ అవేవీ చేయలేదు. ఆమెకు సరైన స్క్రీన్ స్పేస్ కూడా దక్కలేదు. కనిపించిన కొద్ది సందర్భాల్లోనూ ఆమెను నెగెటివ్‌గానే చూపించారు.
దీనికి తోడు బూతులు, స్మోకింగ్: పొగ తాగడం అనేది ఆమె వ్యక్తిగత విషయం. కానీ బిగ్‌బాస్ వీక్షకుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉన్నారు. చాలామంది ఈ విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోలేకపోయారు. పైగా అంతపెద్ద షోలో పచ్చి బూతులు మాట్లాడటాన్ని కూడా చాలామంది తప్పుగా భావించారు. దీనివల్ల కూడా ఆమె ఓట్లకు గండి పడిందనేది కాదనలేని నిజం.