బిగ్ బాస్ 5 తెలుగు మొదలైన తర్వాత సోషల్ మీడియాలో ట్రోలింగ్‌తో పాటు ఊహలు, అంచనాలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా తొలివారం నామినేషన్స్ నుంచి చివర్లో టైటిల్ గెలిచే విన్నర్ వరకు అందర్నీ ఊహిస్తుంటారు. ఇప్పుడు కూడా ఉన్న 19 మంది కంటెస్టెంట్స్‌లో కొందరు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. వాళ్ళలో టాప్ ఎవరో లెక్కలేయడం కూడా చాలా కష్టమే అవుతుంది. ఎందుకంటే షో మొదలై రెండు రోజులే అవుతుంది కాబట్టి. అయినా కూడా బయట వాళ్లకు ఉన్న పాపులారిటీ.. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన విధానం బట్టి ఉన్న వాళ్ళలో కాస్త స్ట్రాంగ్‌గా కనిపిస్తున్న కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం..