యూ ట్యూబ్ సెన్సేషన్.. ఈ పదానికి నిలవెత్తు నిదర్శనం షణ్ముఖ్ జస్వంత్. యూ ట్యూబ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్లకు ఈ కుర్రాడి గురించి తెలియని వాళ్లుండరేమో అంటే అతిశయోక్తి కాదేమో..? ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే మోస్ట్ ఇన్ఫ్లూయెన్సెడ్ పీపుల్లో ఒకడిగా నిలిచాడు షణ్ణు. ఇప్పుడు బిగ్ బాస్ 5 తెలుగు కారణంగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియా సంచలనమయ్యాడు.
మిస్టర్ షణ్ణు అంటూ అమ్మాయిలు కూడా ఈయన్ని ముద్దుగా పిలుస్తుంటారు. ఇప్పుడు మనోడి క్రేజ్ బాగా పెరిగిపోయింది. అయినా ఎప్పుడొచ్చామన్నది కాదు.. ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు యూ ట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. బిగ్ బాస్ 5 తెలుగు కంటే ముందు కొందరికే పరిచయం ఉన్న షణ్ముఖ్.. ఇప్పుడు స్టార్ అయిపోయాడు.
ఈయన వెబ్ సిరీస్ కొత్త ఎపిసోడ్ విడుదలైతే చాలు యూ ట్యూబ్ షేక్ అయిపోతుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో రోజుల తరబడి ఈయన వీడియోలు నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంటున్నాయి. ఎన్ని కొత్త వీడియోలు విడుదలైనా కూడా షణ్ణును బీట్ చేయలేకపోతున్నాయి. తాజాగా బిగ్ బాస్ 5 తెలుగు ఫైనలిస్టుగా మారి తన క్రేజ్ మరింత పెంచుకున్నాడు ఈయన.