ఈయన బయటికి వచ్చేసాడనే ప్రచారం బయటికి వచ్చినప్పటి నుంచి ఆడియన్స్‌తో పాటు ఫ్యాన్స్ కూడా షాక్ అయిపోయారు. అసలు రవి ఎలిమినేట్ కావడం ఏంటి.. అంత మంచి ఫాలోయింగ్ ఉంది.. మంచి గేమ్ ఆడుతున్నాడు కదా.. అలాంటప్పుడు రవి ఎలా ఎలిమినేట్ అయ్యాడబ్బా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అబ్బే.. ఇందులో ఏదో మతలబు ఉంది.. లేకపోతే రవి అంత ఈజీగా ఎలా ఎలిమినేట్ అవుతాడబ్బా అంటూ అడుగుతున్నారు నెటిజన్లు.
ప్రస్తుతం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్‌లో రవి కూడా స్ట్రాంగ్. ఆయన కచ్చితంగా టాప్ 5లోకి వస్తాడని అంతా ఊహించారు. టైటిల్ విన్నర్ అవుతాడనే నమ్మకాలు తక్కువగానే ఉన్నా.. కచ్చితంగా టాప్ 5లో అయితే ఉంటాడని ఊహించారంతా. కానీ ఇప్పుడు ఊహించని విధంగా ఈయన 12వ వారమే బయటికి వచ్చేసాడు. దానికి కారణాలు కూడా ఎక్కువగా ఏం కనిపించడం లేదు.
రవి బయటికి రావడం అనేది కావాలనే చేసారని వాదన వినిపిస్తుంది. యాంకర్ రవి కంటే ప్రియాంక సింగ్ స్ట్రాంగ్ ప్లేయరా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. రవి కంటే పింకీ బాగా ఆడుతుందా.. ఆమె కంటే ఏ విషయంలో రవి వీక్ అనేది చెప్పాలంటూ రవి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇదేదో ప్రియాంక సింగ్‌ను కాపాడటానికి రవిని కావాలనే ఎలిమినేట్ చేసారనే ప్రచారం జరుగుతుంది.
ఈ సీజన్లో మూడో వారం లహరి షారి ఎలిమినేట్ అయినపుడు కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. ఆ తర్వాత శ్వేతా వర్మ విషయంలోనూ ఇలాంటి రచ్చే జరిగింది. అయితే వాళ్లిద్దరి కంటే కూడా రవి చాలా స్ట్రాంగ్ ప్లేయర్. సిరి, పింకీ కంటే కూడా రవికి తక్కువ ఓట్లు వచ్చాయని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్తున్నారు. కానీ ఇందులో నిజం లేదనేది రవి ఫాలోయర్స్ చెప్తున్న మాట.