తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ రవికి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనోడికి మంచి ఇమేజ్ ఉంది. దాన్నే ఇప్పుడు బిగ్ బాస్ 5 తెలుగులో కూడా చూపిస్తున్నాడు. ప్రతీవారం నామినేట్ అవుతున్నా కూడా అంత బాగా రవి సేవ్ అవుతున్నాడంటే దానికి కారణం బయట ఈయనకు ఉన్న ఫాలోయింగ్. ఇప్పుడు కూడా యాంకర్ రవి తనదైన గేమ్ ప్లేతో ముందుకెళ్తున్నాడు.
అసలు విషయం ఏంటంటే.. యాంకర్ రవితో పాటు ఆయన కుటుంబాన్ని కూడా చెడుగా ట్రోల్ చేస్తున్నారు కొందరు యాంటీ ఫ్యాన్స్. ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను బయటకి కంపేర్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు వాళ్లు. అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా కొన్నిసార్లు నెగిటివ్ అవ్వొచ్చు కానీ అదే బయట కూడా ఉంటుందని ఎలా అనుకుంటారంటూ ప్రశ్నలు వస్తున్నాయి.