బిగ్ బాస్ 5 తెలుగు చివరికి వచ్చేసింది. మరో రెండు వారాల్లో షో ముగుస్తుంది. పైగా నామినేషన్స్ కూడా ఆసక్తికరంగా జరిగాయి. చివరి నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. దాంతో ఇంట్లోంచి 14వ వారం ఎవరు బయటికి వెళ్లిపోతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆఖరి వారం నామినేషన్స్ చాలా డిఫెరెంట్‌గా ప్లాన్ చేసాడు బిగ్ బాస్. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి ఐదుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు.
ప్రస్తుతం ఇంట్లో టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో కేవలం శ్రీరామ్ మాత్రమే సేఫ్ అయ్యాడు. ఈయన టిక్కెట్ టూ ఫినాలే గెలవడంతో ఆయన్నెవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. అందుకే ఈ వారం ఆయన సేఫ్ అయ్యాడు. దాంతో మిగిలిన ఐదుగురి నామినేషన్స్ రసవత్తరంగా జరిగాయి. నెంబర్ గేమ్‌లో భాగంగా ఈ వారం ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో శ్రీరామచంద్ర మాత్రమే పక్కనున్నాడు.
మిగిలిన ఇంటి సభ్యులంతా నామినేట్ అయ్యారు. ఇందులో షణ్ముక్, సన్నీ , మానస్, సిరి, కాజల్ ఉన్నారు. వీళ్లలో టాప్ 5లోకి ఎవరు వెళ్తారు.. ఎలిమినేట్ అయ్యే ఆ ఒక్క కంటెస్టెంట్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తుంటే మాత్రం సన్నీ, షణ్ముక్ సేవ్ అవ్వడం ఖాయం. ఈ ఇద్దరికి బయట మంచి ఫాలోయింగ్ ఉంది. కచ్చితంగా టాప్ 5లో ఈ ఇద్దరూ ఉంటారనేది అందరికీ తెలుసు.
ఆల్రెడీ శ్రీరామ్ ఫైనల్‌కు వచ్చాడు అంటే ముగ్గురి ప్లేస్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లే. మిగిలిన రెండు స్థానాల కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ వారం మానస్, సిరి, కాజల్ ముగ్గురిలోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోందని తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ ప్రకారం చూస్తుంటే కాజల్ కంటే సిరికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. గత కొన్ని వారాలుగా ఇదే జరుగుతుంది. ఈ ఇద్దరిలో ఎప్పుడూ సిరి టాప్‌లో ఉంటుంది.
ఈ సారి కూడా ఇదే జరుగుతుంది. అయితే ఈ సారి షణ్ముక్ కూడా నామినేషన్స్‌లోనే ఉన్నాడు కాబట్టి సిరి ఓట్ల శాతం తక్కువగా ఉండబోతుంది. మరోవైపు మానస్ కూడా తనదైన ఓటింగ్‌తో ముందుకెళ్తున్నాడు. ఒకవేళ సిరి లీస్ట్‌లో ఉండి ఎలిమినేట్ అయితే మాత్రం కచ్చితంగా ఫీమేల్ కంటెస్టెంట్లో కాజల్ ఒక్కరే ఫినాలేకు చేరుతుంది. అలా కాకుండా ఇద్దరు లేడీస్ ఉండాలనుకుంటే మాత్రం మానస్ ఇంటి ముఖం పట్టక తప్పదు.