Priyanka Singh Bigg boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు రోజు రోజుకూ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు మాత్రమే మిగిలిన ఉన్నారు. మరిలో వారిలో టాప్ 5లో ఎవరు ఉంటారు? అన్నది ఆసక్తి పెంచుతోంది. అయితే 13వ వారం వరకు తన క్రేజ్ తో హౌస్ లో ఉన్నప్రియాంక సింగ్ పదమూడో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది. అయితే ఒకరోజు ముందే ఆమె ఎలిమినేషన్ కు సంబంధించి సోషల్ మీడియాలో లీకులు వచ్చాయి. అనుకున్నట్టే పింకి టాప్ 7 దగ్గరే ఆగిపోయింది. టాప్ 5లో నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలవాలి అనుకున్న ఆమె.. రెండు అడుగుల దూరంలో నిలిచిపోయి.. బిగ్ బాస్ హౌస్ ను వీడింది.
సండే అంటే ఫన్ డే అని హోస్ట్ నాగార్జున చెప్పినా ఆదివారం ఎపిసోడ్ కాస్త బోరింగ్ గానే అనిపించింది. పింకీ ఎలిమినేషన్ కు ముందు అస్లీ కారెక్టర్ అంటూ సినిమా పోస్టర్లతో ఇంటి సభ్యులను పోల్చమనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. మొదటగా సన్నీ వంతు వచ్చింది. సన్నీకి మహానటి పోస్టర్ వస్తే.. ఆ పోస్టర్ ప్రియాంకకు సెట్ అవుతుందని బ్యాడ్జ్ పెట్టేశాడు. ఇక మిగిలినవారిలో డాక్టర్ వసీకరణ్ గా షన్ను, నీలాంబరిగా సిరి, కట్టప్పగా సిరి, అర్జున్ రెడ్డిగా సన్నా, రేలంగి మామయ్యగా శ్రీరామచంద్ర, అపరిచితుడు మానస్, భానుమతి హైబ్రిడ్ పిల్ల బ్యాడ్జ్ సిరికి, పెద రాయుడుగా షన్ను, చిట్టిబాబుగా సన్నీ, ఇస్మార్ట్ శంకర్ డబుల్ ధిమాక్ అంటూ మానస్, సన్నీకి సీతయ్య, మర్యాద రామన్న అన్ లక్కీ ఫెల్లో అంటే శ్రీరామచంద్రకు ఇలా క్యార్టర్లు వచయ్చాయి. ఈ గేమ్ ముగిసిన తరువాత మానస్ సేఫ్ అని నాగ్ ప్రకటించారు. దీంతో పింకీ కూడా హ్యాపీగా ఫీలయ్యింది.
ఆ తరువాత నోట్లో నీళ్లు పోసుకుని పాటలు పాడాలి. దాన్ని మిగతా టీం సభ్యులు కనిపెట్టాల్సి ఉంటుంది. ఈ ఆటలో సన్నీ, కాజల్, ప్రియాంక ఓ టీం. సిరి, షన్ను, మానస్ మరో టీంగా ఉన్నారు. ఇక శ్రీరామచంద్రను సంచాలక్‌గా పెట్టేశాడు. సిరి టీం చివరకు విన్ అయింది. ఈ రెండు గేమ్ ల తరువాత కాజల్ సేఫ్ అయినట్టు ప్రకటించారు నాగార్జున. ఆ తరువాత లూడో అంటూ మరో ఆట ఆడించారు హోస్ట్ నాగ్ .. ఇందులో రొమాన్స్ చేయాలనే టాస్క్ రావడంతో పిల్లోతో మానస్ సరిగ్గా చేయలేకపోయాడు. చివరకు ప్రియాంక వచ్చినా కూడా మానస్ చేయలేకపోయాడు. అలా ఈ టాస్క్‌తో కాజల్ సన్నీ గెలిచారు. ఆ తరువాత చివరగా సిరి సేఫ్ అయినట్టు.. ప్రియాంక ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ ప్రకటించారు.
బయటకు వచ్చిన ప్రియాంక ఇంటి సభ్యుల గురించి చెప్పింది. ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగింది.. వెళ్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో చెప్పాలంటూ టాస్క్ పెట్టాడు. అలా సిరి నుంచి మొదలుపెట్టింది. సిరిని మొదటగా ఇంట్లోకి వచ్చినప్పుడు గోల్డ్ కలర్ డ్రెస్సులో చూశాను ఇదేంటి నాకంటే అందంగా ఉందని అనుకున్నాను. ఆ తరువాత సిరిది కూడా వైజాగ్ అని తెలిశాక ఎక్కువగా క్లోజ్ అయ్యాం. ఒలె పింకీ.. ఒలె ప్రియాంక అంటూ కనెక్ట్ అయిపోయాం. సిరిని చూస్తే నా చెల్లి గుర్తుకు వస్తుంది.. ప్రతీదీ బెస్ట్ ఇస్తుంటుంది. అని సిరి గురించి చెప్పింది.
శ్రీరామచంద్ర గారు.. మై డియర్ రైట్ ఐ.. మొదటి రోజు వైట్ కలర్ డ్రెస్‌లో వచ్చారు.. శ్రీరామచంద్ర మీకు ఫ్యాన్.. మీ పాటకు పెద్ద ఫ్యాన్.. అని చెప్పాను. అలా కనెక్ట్ అయ్యాను...ఆ రోజు నుంచి ఏ రోజు కూడా అది డ్యామేజ్ అవ్వలేదు.. శ్రీరామచంద్రను శ్రీకృష్ణుడిని చేద్దామని ప్రయత్నించాను కానీ కుదర్లేదు అని ప్రియాంక చెప్పుకొచ్చింది.
షన్ను అన్నయ్య ఎప్పుడూ పక్కింటి పిల్లాడిలానే ఉంటాడు. ముందు తమ్ముడు అని పిలుద్దామని అనుకున్నా.. కానీ ముదిరిపోయిన బెండకాయ అని తెలిసి అన్నయ్య అని పిలిచాను.. నువ్ నాతో మాట్లాడటం లేదని నామినేట్ చేశాను.. నేను వెళ్తుంటే.. నువ్ ఏడ్చావ్ అది చాలు అంటూ ప్రియాంక ఎమోషనల్ అయింది. సన్నీ అన్నయ్యే నన్ను ఇంట్లోకి ఆహ్వానించాడు. మొదట్లో అంతగా బాండ్ లేదు.. కానీ రాను రాను సన్నీ అన్నయ్య అంటే ఏదో ఒక ధైర్యం వచ్చింది.. ఎవ్వరితో చెప్పలేనివి నీతో చెప్పుకున్నాను.. విన్నర్ అవ్వాలని అనుకుంటున్నాను.. అని సన్నీ గురించి చెప్పింది.
కాజల్‌ను మొదటి సారి చూసినప్పుడు.. ఇంత అల్లరి చేస్తుందేంట్రా అనుకున్నాను.. ఇంకా ఇలానే అల్లరి చేయాలని ప్రియాంక కోరింది. మానస్‌ను మొదటిసారి చూసినప్పుడు.. ఎవరబ్బా ఈ సిల్కీ హెయిర్ అనుకున్నాను.. మెల్లిమెల్లిగా క్లోజ్ అయ్యాం అంది. ఇక ప్రియాంక కోసం మానస్ తనకు ఇష్టమైన ఉప్పెనంత ప్రేమకు..అనే పాటను పాడాడు. దీంతో ప్రియాంక ఆనంద భాష్పాలను రాల్చింది. ప్రియా ప్రియా చంపొద్దే అనే పాటను శ్రీరామచంద్ర పాడాడు. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగిసింది.
ఇదిగో వెళ్లిపోతుంది అంటూ చాలాసార్లు ప్రియాంక ఎలిమినేషన్ గురించి వార్తలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం మొక్కవోని దీక్షతో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ చివరి జర్నీదాకా చేరుకుంది. టాప్ 5లో కచ్చితంగా ఉంటానని ఆశించింది కానీ.. ఆ ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. 13వ వారంలో బిగ్‌బాస్ హౌస్ నుంచి భారంగా నిష్క్రమించింది. ఈసారైనా ఒక ట్రాన్స్‌జెండర్ ఫినాలేలో అడుగుపెడుతుందేమోనన్న ఆశలను అడియాశలు చేసింది.
అందం, ఆటతీరుతో ఆకట్టుకున్న ప్రియాంక ఎంతోమంది మనసులను గెలచుకుంది. తాజాగా బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేసిన ప్రియాంక ఈ షో ద్వారా ఎంత సంపాదించిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే ఆమెకు వారానికి 1.75 నుంచి 2 లక్షల రూపాయల వరకు చెల్లించినట్లు టాక్! అంటే ఆ లెక్కన పింకీకి 13 వారాలకు గానూ మొత్తంగా దాదాపు పాతిక లక్షల రూపాయలు వెనకేసిందన్నమాట! షోలో ఆమె పర్ఫామెన్స్‌ను బట్టి ఈ పారితోషికం కాస్త అటూఇటుగా ఉండే అవకాశముంది.