బిగ్ బాస్ 5 తెలుగు ఒక్కోవారం అయిపోతుంటే.. ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ సంఖ్య కూడా పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రతీవారం ఒకరు వెళ్లిపోక తప్పదు. ఈ సీజన్లో కేవలం జెస్సీ మాత్రమే అనారోగ్యం కారణంగా బయటికి వచ్చాడు. మిగిలిన వాళ్లంతా ప్రేక్షకుల ఓటింగ్‌తోనే ఎలిమినేట్ అయిపోయారు. ప్రతీవారం ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోబోతున్నారనే విషయంపై ముందుగానే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. బిగ్ బాస్ 5 తెలుగు 12వ వారం ఇంటి నుంచి ఎవరు బయటికి వచ్చేస్తున్నారనే విషయంపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వారం మానస్ కెప్టెన్ అయ్యాడు. ఆయన తప్ప మిగిలిన ఇంటి సభ్యులంతా నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లో 8 మంది సభ్యులున్నారు. మానస్‌ను పక్కనబెడితే కాజల్, సన్నీ, షణ్ముఖ్, సిరి, ప్రియాంక సింగ్, శ్రీరామ్ చంద్ర, యాంకర్ రవి నామినేషన్స్‌లో ఉన్నారు.