Bigg Boss hot Beauty lahari shari Drink: ప్రస్తుతం బిగ్ బాస్ 5వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అయితే టాప్ 5లో తప్పకు ఉంటుందని భావించిన బ్యూటీ భామ లహరి షారి.. మూడో వారమే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. క్యూట్ అండ్ హాట్ లుక్కులతో ఫ్యాన్స్ ఫిదా చేసే ఆమెను.. బిగ్ బాస్ నిర్వాహకులు అన్యాయంగా బయటకు పంపించేశారు అనే టాక్ ఉంది. ఇప్పటికీ ఆమె తిరిగి హౌస్ లో ఎంటర్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఆమె ఓ పెగ్గు వేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి..
గతంలో ఓ ఇంట్వర్యూలో సైతం ఆమె తనకు మందు.. సిగరెట్ అలవాటు ఉందని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా సరదగా ఓ వీడియో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. వివిధ బ్రాండ్ ల మందు బాటిళ్లను ముందు పెట్టుకుంది. డబ్ స్మాష్ తో సందడి చేసింది. ఆ వెంటనే ఓ పెగ్ సిప్ చేస్తూ కొన్ని ఫోటోలు పెట్టింది. అయితే పెగ్ వేయడంలో కూడా ఇంత స్టైలా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం లహరీ షారి పుల్ జోష్ లో ఉంది. బిగ్ బాస్ 5 తెలుగులోకి కంటెస్టెంట్ నెం 3గా వచ్చింది లహరి. అప్పటి నుంచి ఆమె క్రేజ్ రెట్టింపు అవుతూ వచ్చింది. ఇక హౌస్ లో ఆమె అందాల ఆరబోతతో హాట్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా..హాట్ హాట్ లుక్కులతో ఫోటోలు పెడుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటోంది.
లహరి మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అని చెప్పొచ్చు ఎందుకంటే.. యాంకర్ కమ్ న్యూస్ రీడర్ కమ్ జర్నలిస్టు కమ్ మోడల్ కమ్ నటి అని చెప్పాల్సి ఉంటుంది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో డాక్టర్‌గా నటించింది. ఆ తర్వాత మళ్లీ రావా, సారీ నాకు పెళ్లైంది, జాంబి రెడ్డి తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ కు వెళ్లాక ఆ క్రేజ్ రెట్టింపు అయ్యింది. అక్కడి నుంచి వరుస సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
దీంతో లహరిషారి రవిని నేరుగా నిలదిస్తే.. రవి తను అలా అనలేదని చెప్పాడు.. కానీ తరువాత బిగ్ బాస్ నిర్వహాకులు వీడియో వేసి చూపించడంతో రవి అలా అన్నడానికి తేలింది. అయితే రవి, ప్రియ మధ్య రేగిన వివాదంలో అనూహ్యంగా లహరి షారి బిగ్ బాస్ హౌస్ ను వీడాల్సి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె మూడో వారమై హౌస్ ను వీడాల్సి వచ్చింది.
ఈమె అంత త్వరగా ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఈమె ఎలిమినేషన్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మూడు వారాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇంత త్వరగా బయటకు వస్తుందని ఎవరూ ఊహించలేదు. నిజానికి ఆమె కూడా అనుకోలేదు. అందుకే తాను ఎలిమినేట్ అయిన విషయం తెలిసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోయింది లహరి.
తాను ఇంకా ఇంట్లో ఉంటానని.. ఉండాలని అనుకున్నానని చెప్పుకొచ్చింది. నిజం చెప్పాలంటే ప్రేక్షకులు కూడా అలాగే అనుకున్నారు. ఎందుకంటే సూపర్ గ్లామర్ గాళ్‌గా పిచ్చెక్కిస్తుంది లహరి షారి. ఇంట్లో అదిరిపోయే అందాల ఆరబోతతో మెంటల్ ఎక్కిస్తుంది ప్రేక్షకులకు. అలాంటి అమ్మాయిని ఇంత త్వరగా బయటికి పంపించేస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ అదే జరిగింది.
లహరి ఎలిమినేషన్ విషయంలో అన్యాయం జరిగిందంటూ ఈమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఎలిమినేషన్ విషయంలో ఏదో మతలబు జరిగింది అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఓటింగ్ విషయంలో లహరి కంటే ప్రియాకు తక్కువ ఓట్లు వచ్చాయని.. కానీ ప్రియ కోసం లహరిని బలవంతంగా బయటకు పంపించారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ వస్తున్నాయి. తరువాత ఆమెతో రీ ఎంట్రీ ఇప్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం ఆమె సినిమాలో బిజీగా ఉన్నారు.
తాజాగా శ్రీ వేంకటేశ్వర సాయి క్రియేషన్స్ హరి ఐనీడి, రమ్య కొమ్మాలపాటి నిర్మాతలుగా భారీ బడ్జెట్ అండ్ సాహసంతో కూడుకున్న ప్రయత్నమే అయినప్పటికీ సినిమాపైన ఇష్టంతో, ప్యాషన్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అభిరాజ్ రుపాల, సతీష్ V. M అనే ఇద్దరు కొత్త డైరెక్టర్స్ మిస్సమ్మ అనే చిత్రంతో పరిచయం అవుతున్నారు.
మిస్సమ్మ చిత్ర ప్రారంభోత్సవం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఇంటి దగ్గర హీరో హీరోయిన్ల ఫై క్లాప్ కొట్టి ఘనంగా ప్రారంభించారు. టీం అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు తలసాని. ఇంత మంచి కాన్సెప్ట్ తో వస్తున్న మిస్సమ్మ హిట్ కావాలని ఆయన కోరుకున్నారు. తన సన్నిహితుడు హరి అయినీడి సినిమా పరిశ్రమలో చాలా కష్టపడ్డాడు, పెద్ద పెద్ద సినిమాలకు వర్క్ చేశారు, ఫ్యాషన్ ఉన్న నిర్మాత, మంచి వ్యక్తి. అలాంటి హరి అయినీడి కి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని తలసాని అభిలషించారు.
సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ నేచర్, లైవ్లీ అండ్ లవ్లీ బిహేవియర్ తో అలనాటి మిస్సమ్మ ఆల్ టైం క్లాసిక్‌గా చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి క్యారెక్టరైజేషన్ తీసుకుని సరికొత్త కథ, కథనాలతో చేస్తున్న ప్రయత్నం ఈ మిస్సమ్మ. సైంటిఫిక్, హిస్టారిక్ అంశాలతో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతోంది. హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో పాటు ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీ అండ్ యూనిక్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మిస్సమ్మ.
సినిమా కథ విషయానికి వస్తే బ్రిటీషర్స్ రాక ముందు ఇండియన్ హిస్టరీ నుంచీ, బ్రిటిషర్స్ రిజైమ్ నుంచీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తీసుకుని, ఆ విషయాలను ఆసక్తికరంగా, ఎంటర్టైనింగ్గా, థ్రిల్లింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. మిస్సమ్మ సినిమాలో తాను కూడా చెయ్యటం చాలా ఆనందం గా వుంది అన్నారు లహరి షారి. హీరో అర్జున్ కృష్ణ మాట్లాడుతూ .. నాకు నటుడిగా మంచి గుర్తింపు ఇచ్చే సినిమా మిస్సమ్మ అవుతుంది. ఈ సినిమా తరువాత హీరోగా మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నేను రుణపడి వుంటాను అని అన్నారు.