ఆమె ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు వరసగా ఇస్తూనే ఉంది. బిగ్ బాస్ ఇంట్లో జరిగిన ముచ్చట్ల గురించి మీడియా వాళ్లతో బాగానే పంచుకుంటుంది. అందులో చాలా విషయాలు కూడా చెప్పుకొచ్చింది అవ్వ. మరీ ముఖ్యంగా మీ దృష్టిలో ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవుతారని అడిగితే మొహమాటం లేకుండా సంచలన సమాధానం చెప్పింది గంగవ్వ.
ఆమె ప్రకారం చూసుకుంటే ఈ సారి బిగ్ బాస్ టైటిల్ అవినాష్ గెలుస్తాడని చెప్పుకొచ్చింది. ఇంట్లో అందరితో కలిసి ఉంటాడని.. నవ్విస్తూ ఉంటాడని.. ఆ పిలగాడే గెలుస్తడని జ్యోతిష్యం చెప్పింది గంగవ్వ. మరి అవ్వ చెప్పినట్లు అవినాష్ నిజంగానే బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడా.. వైల్డ్ కార్డులో వచ్చిన అవినాష్‌కు ఆ ఛాన్స్ ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.