Dethadi Harika: బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న దేత్తడి హారిక.. తరువాత కూడా అదే ముద్రను కంటిన్యూ చేస్తోంది. ముఖ్యంగా హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దేత్తడి హారిక.. 'దేత్తడి' అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలుగువారికి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ తెలంగాణ యాసతో.. పొగరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.
దేత్తడి సిరీస్‌తో హారికకు నెటిజన్లలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. గత సంవత్సరం బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి ఫైనల్స్ వరకు చేరింది. ఆ సమాయంలో తనకు ఎంతోమంది అభిమానులు అయ్యారు. ఇక ఆతర్వాత యూట్యూబ్ లో ''ఏమండోయ్ ఓనర్ గారు'' అనే వెబ్ సిరీస్ చేసి ఇటీవలే అమ్మడి అనే ఆల్బమ్ కూడా చేసి హిట్ కొట్టింది. దీంతో అభిమానులకు మరింత చేరువ అయ్యింది.
సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది అమ్మాయిలు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సెలెట్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో అలేఖ్య హారిక ఒకరు. అలేఖ్య హారిక అంటే ఎవరికీ పెద్దగా తెలిసి ఉండదు.. కానీ దేత్తడి హారిక అంటే మాత్రం గుర్తుకువస్తుంది. ఆమె యూట్యూబ్ లో దేత్తడి అనే చానల్ ద్వారా పాపులారిటీ సాధించి.. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంది. ఆ యూట్యూబ్ క్రేజ్ తనకు బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చేలా చేసింది. Photo: Instagram.com/alekhyaharika
దేత్తడి ఛానల్ లో వెబ్ సిరీస్‌తో హారికకు నెటిజన్లలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు బిగ్ బాస్ కారణంతో ఆ ఫ్యాన్స్ ఫాలోయింగ్ రెట్టింపు అయింది. ఆమె తెలంగాణ యాసతో అద్బుతంగా మాట్లాడగలదు. ఇలా ఆమె తెలంగాణ ప్రేక్షకులకే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకుంది. ( Instagram.com / alekhyaharika)
యూట్యూబ్ లో వెబ్ సిరీస్ ద్వారా డబ్బుతో పాటు.. బయట ఆఫర్ల వర్షం కురుస్తోంది. వీటితో పాటు తన క్రేజ్‌ను అమాంతం రెట్టింపు చేసేసుకుంది. అందుకే ఆ మధ్య తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికను ఎంపిక చేసింది. అయితే అది కాస్త వివాదాస్పదమైంది. Instagram.com/alekhyaharika
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆ సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆమెకు నియామక పత్రం కూడా అందజేశారు. ఆ తర్వాత దీనిపై విమర్శలు చెలరేగడంతో హారిక మేటర్ వివాదాస్పదం అయిపోయింది. దీంతో ఆమె స్వయంగా ఆ పదవి నుంచి తప్పుకుంది. ఇది అప్పట్లో పెద్ద వైరల్ కూడా అయింది. ఇదంతా ఇలా ఉండగా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హారిక ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది. Instagram.com/alekhyaharika