మరో వారం గడిచిపోయింది.. మరో సోమవారం వచ్చేసింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈ వారం నలుగురు నామినేట్ అయ్యారు. అందులో ముగ్గుర్ని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చి నామినేట్ చేసాడు. మరొకరు మాత్రం సెల్ఫ్ నామినేట్ అయ్యారు. ఈ సారి నామినేషన్స్ గ్రీన్, రెడ్ కలర్ హ్యాట్స్ ఆధారంగా జరిగాయి. అందులో భాగంగానే సోహైల్, మోనాల్ గ్రీన్ హ్యాట్ వచ్చిన కారణంగా సేవ్ అయ్యారు. హారిక కెప్టెన్ కాబట్టి నామినేట్ కాలేదు. అవినాష్, అరియానా, అఖిల్, అభిజీత్ రెడ్ హ్యాట్ వచ్చినందుకు నామినేట్ అయ్యారు. కానీ అందులో మళ్లీ ఒకరికి త్యాగం చేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో అభిజీత్ కోసం తనను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంది మోనాల్ గజ్జర్. అలా ఈ వారం నలుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. మరి వాళ్లెవరో చూద్దాం..