సాయిపల్లవి.. టాలీవుడ్లో టాప్ హీరోయిన్. లేడీ పవర్ స్టార్, నేచురల్ హీరోయిన్ అంటే సాయిపల్లవే. ఆమెకు క్రేజ్ కూడా మాములూగా లేదు. తన నటనతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే సాయి పల్లవి.. ఇటీవలే విడుదలైన తన సినిమా విరాట పర్వం ప్రమోషన్ల కారణంగా చిక్కుల్లో పడిపోయింది సాయి పల్లవి.
అప్పుడు ఏం చేశారో ఇప్పుడు కూడా అలాంటి హింసే చేస్తున్నారని సాయిపల్లవి విమర్శించింది.కశ్మీర్ ఫైల్స్ సినిమాలో కశ్మీరి పండింట్లను ఎలా చంపారో ఆ సినిమాలో చూపించారన్నారు. కానీ ఇప్పుడు కూడా గోవధ చేస్తున్నారంటూ.. ఆవును తీసుకెళ్తున్న ముస్లీం డ్రైవర్‌ను కొట్టి జై శ్రీరామ్ అనాలన్నారు. అప్పుడు జరిగిన దానికి.. ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది అంటూ సాయి పల్లవి ప్రశ్నించింది
ఈ చిత్రంలో మరో మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ కీలకపాత్రలో నటించింది. అంతేకాకుండా ఈ చిత్రానికి సహా నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఈ చిత్రాన్ని తమిళంలో 2డీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్య, జ్యోతికలు విడుదల చేయనున్నారు. తెలుగులో ఎస్పీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నాడు.