Actress Divi Vadthya:బిగ్ బాస్ 4 బ్యూటీ దివీ సోషల్ మీడియాలో సెగలు రేపుతూనే ఉంది. రోజుకో కొత్త కొత్త అందాన్ని కానుకగా ఇస్తోంది. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ టాలీవుడ్ లో హాట్ సెన్షేషన్ గా మారుతోంది. ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చకు కుర్రకారు కుదేలైపోతున్నారు. రోజు రోజుకూ ఆమె క్రేజ్ రెట్టింపు అవుతోంది. ఇటీవల క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ తో అదరగొట్టిన ఆమె.. త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద కనిపించనుంది.
మహర్షి సినిమాలో కనీ కనిపించక అన్న రీతిలో ఓ చిన్నరోల్లో కనిపించిన భామ దివి. బిగ్ బాస్ తర్వాత వచ్చిన క్రేజ్ తో హీరోయిన్గా సెటిల్ కావాలని అనుకుంటుంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. దివి అందాల విందు మాయ టాలీవుడ్ మొత్తం పాకుతోంది. రానున్న రోజుల్లో దివి టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
తాజాగా వచ్చిన వెబ్ సిరీస్ పర్వాలేదు అనిపించికున్నా.. దివి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రం సెగలు పుట్టిస్తోంది.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా సంప్రదాయంగా కనిపించిన దివీ.. బయటకు వచ్చాక అందాల ఆరబోతలో గేట్లు తెరిచేసింది. గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. బిగ్ బాస్ లాంటి షోలలో, అవార్డుల వేదికలపై దివి అందాల విందు వడ్డిస్తూ హాట్ డాన్స్ తో రెచ్చిపోతోంది. ఇలా డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తో దివి తన టాలెంట్ ని బయట పెట్టడం మాత్రమే కాదు.. గ్లామర్ పరంగా కూడా దర్శక నిర్మాతలు దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆకట్టుకునే అందం.. అదరగొట్టే డాన్స్, హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడానికి ఇంతకు మించిన క్వాలిటీస్ ఏం కావాలీ అంటోంది ఈ బిగ్ బాస్ బ్యూటీ.. అందుకే తన అందాల విందుకు సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుంటోంది. మరోసారి గ్లామర్ షో తో రెచ్చిపోయింది. చూడ ముచ్చటగా ఉన్న స్కై బ్లూ కలర్ లెహంగాలో దివి అందాలు ఆరబోస్తోంది. సింహాసనంపై కూర్చున్న అందాల యువరాణిలా దివి గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తోంది.
దివి తన నడుం ఒంపులతో చేసే గ్లామర్ షోకి కుర్రాళ్లు మాయలో పడిపోవడం ఖాయం. అంతలా దివి అందాల మత్తు జల్లుతోంది. క్యూట్ గా, హాట్ గా ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివి ఈ ఫోటోలని ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ పుష్ప చిత్రంలోని సామీ పాట లిరిక్స్ కామెంట్స్ గా పెట్టింది. ' నా కొంగే జారేటప్పుడు నువ్వు చూడకుంటే సామీ ఆ కొంటె గాలి నన్నే చూసి జాలే పడదా సామీ' అంటూ రొమాంటిక్ లిరిక్స్ పోస్ట్ చేసింది.
సినిమాల్లో నటించాలని, తనని తాను వెండితెరపై చూసుకోవాలనే కోరిక ఉందని దివి ఆమద్యన తెలిపింది. మంచి అవకాశాలు దక్కితే మాత్రం దివి హీరోయిన్ గా తక్కువ టైంలోనే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. దివి తన గ్లామర్ తో అప్పుడే రికార్డులు కూడా కొట్టేస్తోంది. 'హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ వుమెన్' గా 2020 టివి విభాగంలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత అందుకోవడంపై దివి సంతోషం వ్యక్తం చేసింది.