Bhumi Pednekar : భూమి పెడ్నేకర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ హిందీ ప్రేక్షకులకు మాత్రం భూమితో చాలా పరిచయం ఉంది. అక్కడి ఆడియన్స్ మనసులను బాగానే దోచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. దమ్ లగా కే ఐసా సినిమాతో పరిచయం అయిన ఈ బ్యూటీ.. తొలి సినిమాలో 130 కేజీల బరువుతో కనిపించింది. ఆ తర్వాత ఒకేసారి 60 కేజీలు తగ్గిపోయి నాజూగ్గా మారిపోయి హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. లస్ట్ స్టోరీస్ లాంటి వెబ్ సిరీస్‌లో రెచ్చిపోయి నటించింది భూమి.