పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు.మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను ఢీ అంటే ఢీ అనే పాత్రలో డేనియర్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి పాత్ర అదిరిపోయింది. తెలుగులో చేసిన పాత్రలను మాతృకలో ఎవరు చేసారో మీరు ఓ లుక్కేయండి.. (Twitter/Photo)
ఈ సినిమా మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్, బిజూ మీనన్ చేసిన పాత్రలను తెలుగులో పవన్ కళ్యాన్, రానా చేసారు.మలయాలంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కంటే రిటైర్డ్ మిలటరీ హవాల్దార్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కానీ తెలుగుకు వచ్చేసరికి రానా పాత్రకు ప్రాధాన్యం తగ్గించి , పవన్ కళ్యాణ్ చేసిన పాత్రకు ప్రాధాన్యత పెరిగింది. (Twitter/Photo)
మలయాళ మాతృకలో బ్రహ్మానందం పాత్ర లేదు. తెలుగులో ఆ క్యారెక్టర్‌ను జోడించారు. మలయాళంలో నాలుగు పాటలు ఉంటే... తెలుగులో డీజే వెర్షన్‌తో కలిపి ఐదు పాటలున్నాయి. ఈ సినిమాలో ‘బీమ్లా నాయక్’ వర్సెస్ డేనియర్ శేఖర్ పాత్రలను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరి మలయాళం మాదిరే తెలుగులో ఈ సినిమా ఏ మేరకు హిట్ సాధిస్తుందనేది చూడాలి. (Twitter/Photo)